Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అసలైన పెళ్లిళ్ల సాంబార్ రుచి రావాలంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి!

అసలైన పెళ్లిళ్ల సాంబార్ రుచి రావాలంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి!

CHAI PaKODi 2 weeks ago

Wedding style Sambar Recipe: తెలుగు వారికి సాంబార్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అన్ని కూరలకు కాంబినేషన్ గా చేసిన, అన్నిటిని డామినేట్ చేసేస్తుంది.

సరిగ్గా పెళ్లిల్లో చేసే సాంబార్ లో ఉండాలంటే, ఈ విధంగా చేసుకోండి.

కావాల్సిన పదార్ధాలు
కందిపప్పు – 1/3 కప్పు
పెసరపప్పు – ¼ కప్పు
పసుపు – 1/4టీ స్పూన్
నీళ్లు - 3 కప్పులు
చింతపండు గుజ్జు - 250ml
కారం - 1.5 టేబుల్ స్పూన్స్
సాంబార్ పొడి - 2 టీ స్పూన్స్
ఉప్పు - తగినంత
నూనె - 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1/2టీ స్పూన్
మెంతులు – 1/4టీ స్పూన్
ఇంగువ – 1/4టీ స్పూన్
కరివేపాకు - 1 రెబ్బ
సాంబార్ ఉల్లిపాయలు - 20
ఫ్రెంచ్ బీన్స్ - 3
పచ్చిమిర్చి - 4
బూడిద గుమ్మడి ముక్కలు - 6 నుంచి 7
వంకాయ ముక్కలు - 4 నుంచి 5
ములక్కాడ ముక్కలు - 6 - 7
తీపిగుమ్ముడి ముక్కలు - 7 నుంచి 8
క్యారేట్ ముక్కలు – 1/4కప్పులు
క్యాప్సికమ్ ముక్కలు – 1/2కప్పు
టామాటో - 2
నీళ్లు - 600ml
ధనియాల పొడి - 1 టీ స్పూన్
బెల్లం - 1 టేబుల్ స్పూన్

తాళింపు కోసం..
నెయ్యి - 2 టీ స్పూన్స్
ఆవాలు – 1/2టీ స్పూన్
ఎండుమిర్చి - 3
జీలకర్ర - 1 టీస్పూన్
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమీర - చిన్న కట్ట

Also Read:పూజలో అగరబత్తులు ఎందుకు వెలిగిస్తారో తెలుసా? ఈ ఆసక్తికరమైన నిజాలు మీకోసమే!

తయారీ విధానం
1.కుక్కర్ లోకి కందిపప్పు, పెసరపప్పు, పసుపు, నీళ్లు తీసుకుని మూత పెట్టి, మెత్తగా ఉడికించుకోవాలి.
2. ఉడికిన పప్పును, పప్పు గుత్తి సాయంతో మెత్తగా చేసుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని, కొద్దిగా ఆయిల్ వేసి, అందులోకి ఆవాలు, మెంతులు, వేసుకుని, కరివేపాకు, ఇంగువ వేసి, వేపుకోవాలి.
4. వేగిన ఆ తాళింపులో సాంబార్ ఉల్లిపాయలు వేసి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి.
5. ఆ తర్వాత మిగిలిన కూర గాయల ముక్కలు అన్ని వేసి మూత పెట్టుకుని మూడు నుంచి నాలుగు నిముషాలు వేగనివ్వాలి.
6. ఈలోపు ఒక గిన్నేలోకి చింతపండు గుజ్జు, కారం, సాంబార్ పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

Also Read:మీ జీతం 15 వేలేనా? రోజుకు రూ.50 దాస్తే చాలు.. రిటైర్మెంట్ నాటికి రూ.30 లక్షలు గ్యారంటీ!

7. మగ్గిన కూరగాయల ముక్కల్లో చింతపండు పులుసు పోసి, ఉడికించుకోవాలి.
8. పులుసు మరుగుతున్న సమయంలో మెత్తగా చేసిపెట్టుకున్న పప్పు, 200 ml నీళ్లు, కలిపి, మూత పెట్టి, 15 నిముషాల పాటు మరిగించాలి.
9. మరుగుతున్న సమయంలో బెల్లం వేసి మరో 5 నిముషాలు మరిగించాలి.
10. ఇప్పుడు తాలింపు కోసం, కడాయి పెట్టుకుని, నెయ్యిని కరిగించి, అందులోకి తాళింపులు వేసి, వేగాక, సాంబార్ లో కలుపుకుని చివరగా కొత్తిమీర తరుగు వేసి 3 నిముషాలు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సాంబార్ రెడీ.

Also Read:ఈ ఒక్క నూనెతో మీ జుట్టు రాలే సమస్యకు శాశ్వత పరిష్కారం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi