Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాడీ హీట్, బ్లడ్ ప్రెజర్.. రెండింటికీ చెక్ పెట్టే మ్యాజిక్ జ్యూస్ ఇదే!

బాడీ హీట్, బ్లడ్ ప్రెజర్.. రెండింటికీ చెక్ పెట్టే మ్యాజిక్ జ్యూస్ ఇదే!

CHAI PaKODi 1 week ago

Pineapple and keera juice benefits : వేసవి కాలంలో అలసట,నీరసం లేకుండా ఉండాలంటే కొన్ని రకాల డ్రింక్స్ తీసుకుంటే మంచిది. మనం ఇంటిలోనే మంచి పోషకాలు ఉన్న డ్రింక్స్ తయారుచేసుకోవచ్చు.

ఫైనాఫిల్,కీరా,యాపిల్ తో డ్రింక్ తయారుచేసుకుంటున్నాం. ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు ఫైనాఫిల్ ముక్కలు,ఒక కప్పు కీరా ముక్కలు,అరకప్పు యాపిల్ ముక్కలు వేయాలి.

ఆ తర్వాత ఒక కప్పు నీటిని పోసి మిక్సీ చేయాలి. ఈ జ్యూస్ ని ఒక గ్లాస్ లోకి వడకట్టాలి. ఈ జ్యూస్ లో అరచెక్క నిమ్మరసం, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. చల్లదనం కోసం ఐస్‌క్యూబ్స్‌ వేయాలి. ఈ జ్యూస్ ని వారంలో రెండు సార్లు తాగవచ్చు. ఈ జ్యూస్ లో antihypertensive సామర్ధ్యం ఉండుట వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

Also Read:7 రోజుల్లో బరువు తగ్గడం ఎలా? మీ బెల్లీ ఫ్యాట్ మాయం చేయండి!

పైనాపిల్, కీరా ముక్కల్లో విటమిన్‌ సి, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండు చర్మం పొడిగా మారకుండా కాపాడతాయి. విటమిన్‌ సి ప్రోటిన్‌తో కలిసి ముఖం మీద ముడతలు రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సెబేసియస్‌ గ్రంథుల పనితీరు మెరుగుపడి, చర్మం తేమగా ఉంటుంది.వయసు పెరిగే కొద్ది వచ్చే సమస్యలు తగ్గుతాయి.

Also Read:రాత్రంతా నానబెట్టి ఉదయం తింటే చాలు.. మీ శరీరం లోపల ఏం జరుగుతుందో తెలుసా?

ఈ జ్యూస్‌లో బ్రోమెలైన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది యాంటీఇన్‌ఫ్లమేటరి విధులను నిర్వహిస్తుంది. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నియంత్రిస్తుంది. తరచూ ఈ డ్రింక్‌ తాగడం వల్ల క్యాన్సర్‌ ముప్పు కూడా తగ్గుతుంది. పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియంలు ఉండడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అధిక బరువును కూడా తగ్గిస్తుంది.

Also Read:షుగర్ కంట్రోల్ అవ్వట్లేదా? ఈ ఆకులను ట్రై చేయండి, ఫలితం మీరే చూస్తారు!

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi