Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చపాతీలు ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయాలు తెలియకపోతే ముప్పు తప్పదు!

చపాతీలు ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయాలు తెలియకపోతే ముప్పు తప్పదు!

CHAI PaKODi 1 week ago

Wheat flour side effects In Telugu : అన్నం కంటే చపాతీలు తింటేనే ఆరోగ్యానికి మంచిదని, త్వరగా బరువు తగ్గుతామని చాలామంది రోజూ గోధుమ పిండిని ఎక్కువగా వాడుతుంటారు.

కానీ, గోధుమ పిండిని మోతాదుకు మించి తీసుకుంటే మన శరీరంలో ఊహించని మార్పులు జరుగుతాయని, కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవని మీకు తెలుసా? అసలు గోధుమ పిండి అతిగా వాడితే ఏమవుతుంది? ఈ ఆర్టికల్ చదివి పూర్తి వివరాలు తెలుసుకోండి.

మనలో చాలామంది గోధుమపిండి మంచిది అనే భావనతో అన్నంకి బదులు గోధుమ పిండితో చపాతీలు చేసుకుని తింటూ ఉంటారు ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు అన్నం మానేసి చపాతి తింటుంటారు.

అయితే గోధుమ పిండి ఎక్కువగా తింటే మన ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయానికి వస్తే గోధుమ పిండిని ఎక్కువగా తీసుకోకుండా ఉంటేనే మంచిదని నిపుణులు అంటున్నారు.ఏదైనా లిమిట్ గా తీసుకుంటే మనకు తగినంత ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.

గోధుమ పిండిలో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుంది ఇది శరీరంలో ఎక్కువ అయితే కొన్ని సమస్యలు వస్తాయి నిజానికి గోధుమ పిండిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుందని మనలో చాలామంది భావించి తింటూ ఉంటారు.

రిఫైన్డ్ చేసిన గోధుమపిండిలో ఫైబర్ తక్కువగాను గ్లూటెన్ ఎక్కువగానే ఉంటుంది అందువల్ల గోధుమ పిండి ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి, గ్యాస్ సమస్య, పేగుల్లో వాపు, నీళ్ళతో కూడిన విరేచనాలు వచ్చే అవకాశం ఉంది.

రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయానికి ఇలా వేడివేడి పొరల పరాఠా చేసుకోండి!

అంతేకాకుండా విటమిన్ కె,ఇరన్ లోపం కూడా ఏర్పడుతుంది. కాబట్టి గోధుమలను మనం ఆడించుకుని పిండి తయారు చేసుకొని వాడితే ఎటువంటి సమస్యలు ఉండవు.

మార్కెట్లో దొరికే గోధుమపిండిలో ఫైబర్ తక్కువగాను గ్లూటెన్ ఎక్కువగానే ఉంటుంది అదే మనం ఆడించుకున్న పిండిలో ఫైబర్ ఎక్కువగానూ గ్లుటెన్ తక్కువగానూ ఉంటుంది. అందువల్ల గోధుమలను ఆడించుకున్న పిండి మంచిది.

కరకరలాడే 'క్రిస్పీ కార్న్'.. రెస్టారెంట్ టేస్ట్‌తో ఇంట్లోనే ఈజీగా చేసుకోండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi