మారిన జీవనశైలి కారణంగా ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే డయాబెటిస్ అనేది వచ్చేస్తుంది. జీవితంలో ఒకసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే.
అలా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలను ఫాలో అయితే డయాబెటిస్ అనేది మందుల మోతాదు పెరగకుండా నియంత్రణలో ఉంటుంది.
డయాబెటిస్ నిర్వహణలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది. అందువల్ల చాలామంది కాకరకాయను తినటానికి ఇష్టపడరు.
కానీ కాకరకాయలో ఉన్న పోషకాలు డయాబెటిస్ నియంత్రణలో చాలా బాగా సహాయపడతాయి. అలాగే కాకర ఆకులు కూడా డయాబెటిస్ నియంత్రణలో చాలా బాగా సహాయపడతాయి.
కాకర ఆకు కూడా కాకరకాయ వలె కాస్త చేదుగానే ఉంటుంది. కాకరకాయ రుచి ఎలా ఉంటుందో దాదాపు కాకర ఆకు రుచి కూడా అలానే ఉంటుంది.
అయితే కాకరకాయతో పోలిస్తే కాకర ఆకులో ఎక్కువ శక్తివంతమైన పోషకాలు ఉన్నాయి.
కాకర ఆకులు డయాబెటిస్ ఉన్నవారు రెగ్యులర్ గా తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం కనబడుతుంది. కాకర ఆకులు అనేక బయో ఆక్టివ్ లక్షణాలు ఉండటం వలన ప్రాచీన కాలం నుండి కాకర ఆకును సాంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు.
కాకర ఆకులలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండటం వలన డయాబెటిక్ నివారణలో చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది.
అయితే కాకర ఆకుని ఎలా తీసుకోవాలో చూద్దాం. ఒక గ్లాసు నీటిలో మూడు కాకర ఆకులను వేసి పది నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడగట్టి ప్రతిరోజు ఉదయం పరగడుపున పావు కప్పు మోతాదులో తీసుకుంటే సరిపోతుంది.
ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకోవడం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- ఉదయం పరగడుపున ఇది '1 కప్పు' తింటే చాలు.. మతిమరుపు మాయం, మెదడు
- Select బొప్పాయి+దానిమ్మ కాంబినేషన్.. ఈ రెండు పండ్లు కలిపి తీసుకుంటే జరిగేది ఇదే.. నిజంగా నమ్మలేరు!
సీజనల్ గా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి కాకర ఆకుల రసాన్ని తాగటానికి ప్రయత్నం చేయండి. మీకు కాకర ఆకులు లభ్యం కాకపోతే కాకర ఆకుల పొడి ఆన్లైన్ స్టోర్ లోను ఆయుర్వేదం షాపులను లభ్యమవుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

