ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ అనేది వచ్చేస్తుంది . డయాబెటిస్ తో బాధపడుతున్నవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం అనేది వారి డయాబెటిస్ నిర్వహణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ మధ్యకాలంలో డ్రై ఫ్రూట్స్ వాడకం కూడా చాలా ఎక్కువ అయింది.
అయితే డయాబెటిస్ ఉన్నవారు వాల్నట్స్ తింటే మంచిదేనా.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈరోజు తెలుసుకుందాం.
వాల్ నట్స్ ఇన్సులిన్ నిరోధకతను పెంచడానికి రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి.. అలాగే డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.
వాల్నట్స్ లో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన పైబర్స్ విచ్ఛిన్నం మరియు జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇలా జరగటం వలన రక్త ప్రవాహంలో చక్కెరను చాలా నిదానంగా విడుదల చేస్తుంది.
వాల్నట్స్ గ్లైజమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి.
రోజులో రెండు వాల్నట్స్ తింటే సరిపోతుంది వాల్ నట్స్ ఐదు గంటల పాటు నానబెట్టి పై తొక్క తీసి తినాలి.
ఏ డ్రైఫ్రూట్ అయినా నానబెట్టి తింటేనే దానిలో ఉన్న పోషకాలు 100% మన శరీరానికి అందుతాయి. ఒకవేళ నాన పెట్టకుండా తింటే వాటిలోని పోషకాలు 60 శాతం మాత్రమే మన శరీరానికి అందుతాయి.
డయాబెటిస్ ఉన్న వారిలో చెడు కొలెస్ట్రాల్ చాలా తొందరగా పెరిగిపోతుంది. ఆ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా వాల్నట్స్ చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- Face Glow:"ముఖంపై నలుపు, ట్యాన్ మాయమై.. పాలలా మెరిసిపోవాలా? కాఫీ పొడితో ఇలా చేస్తే చాలు!"
- "పార్లర్కు వెళ్లి వేలు ఖర్చు చేయక్కర్లేదు.. ఇంట్లోనే నల్లని పాదాలను తెల్లగా మార్చే సీక్రెట్ ఇదే!"
అధిక బరువు సమస్య ఉన్నవారిలో శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కేవలం రోజులో రెండు వాల్నట్స్ మాత్రమే తినాలి. మోతాదు మించితే సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

