Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దీన్ని పాలల్లో ఉడికించి తింటే చాలు.. రక్తహీనత, కీళ్ల నొప్పులు ఇక మాయం!

దీన్ని పాలల్లో ఉడికించి తింటే చాలు.. రక్తహీనత, కీళ్ల నొప్పులు ఇక మాయం!

CHAI PaKODi 3 weeks ago

Dry fruits milkshake benefits In Telugu :ఈ ఉరుకులు పరుగుల జీవితంలో సరైన ఆహారం తీసుకోక చాలామందికి విపరీతమైన నీరసం, రక్తం తక్కువగా ఉండటం (రక్తహీనత), చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి.

దానికి తోడు తిన్నది సరిగ్గా అరగక గ్యాస్ సమస్యలు కూడా వేధిస్తుంటాయి.

వీటన్నింటికీ విడివిడిగా మందులు వాడే బదులు, మన ఇంట్లోనే చేసుకోగలిగే ఒక అద్భుతమైన చిట్కా ఉంది. పాలల్లో ఈ ఒక్క వస్తువుని ఉడికించి తీసుకుంటే చాలు.. మీ శరీరంలో అద్భుతమైన బలం వస్తుంది.

అసలు ఆ వస్తువు ఏంటి? దాన్ని ఎలా తీసుకోవాలి అనేది ఈ పోస్ట్‌లో చాలా వివరంగా చెప్పాను. మీ ఆరోగ్యానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఒకసారి చదివి చూడండి.

పాలలో నల్ల ఎండు ద్రాక్ష ఉడికించి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి నల్ల ఎండు ద్రాక్షను మామూలుగా తినటం కన్నా పాలల్లో ఉడికించి తింటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.

దీనిలో కరగనీ మరియు కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ప్రేగు కదలికలు సాఫీగా జరగడానికి సహాయపడి మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధ. పడుతున్నారు అలాంటి వారు పాలల్లో ఉడికించిన నల్ల ఎండు ద్రాక్ష తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది దీనిలో ఫైబర్ పొటాషియం,ఫినాల్స్ వంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉండటం వలన గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది.

హైదరాబాద్ స్ట్రీట్ స్టైల్ మసాలా మిర్చీ బజ్జీ.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది!

యాంటి మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన అలాగే ఫైటో కెమికల్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన పంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.

కావిటిస్ కి కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను అణిచివేస్తుంది. అంతేకాకుండా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కీళ్ల నొప్పులు, మోకాలి నొప్పులు వంటి అన్ని రకాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఒక గ్లాసు పాలలో 5 నల్ల ఎండు ద్రాక్షను వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన ఎండు ద్రాక్షను నములుతూ పాలను తాగాలి. ఈ పాలను ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు తాగవచ్చు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ కైనా, రాత్రి డిన్నర్ కైనా.. ఈ స్టీమ్డ్ రైస్ బాల్స్ చేస్తే ఇంట్లో అంతా ఇష్టంగా తింటారు!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi