Thyroid Home Remedies:ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. సమస్యలు రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు.
సమస్య ప్రారంభంలో ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. సమస్య తీవ్రతను బట్టి డాక్టర్ని సంప్రదించాలి.
ఈ మధ్యకాలంలో థైరాయిడ్ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. ఈ సమస్య వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. థైరాయిడ్ సమస్య అనేది హార్మోన్ ఇన్ బాలన్స్ కారణంగా వస్తుంది.
చాలామంది బరువు తగ్గడం, మందులు వేసుకుంటే ఈ సమస్య సెట్ అవుతుంది అని భావిస్తారు. కానీ ఈ సమస్యకు వ్యాయామంతో పాటు మంచి పోషకాలు ఉన్న ఆహారం కూడా తీసుకోవాలి.
థైరాయిడ్ హార్మోన్లు సరిగా పనిచేయనప్పుడు థైరాయిడ్ సమస్య వస్తుంది. థైరాయిడ్ గ్రంధి థైరాక్సిన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఇది జీవక్రియ రేటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పని చేయకపోతే ఆ ప్రభావం జీవక్రియలు మీద ముందుగా పడుతుంది.
థైరాయిడ్ గ్రంథి తక్కువ హార్మోన్ విడుదల చేస్తే ఒక రకమైన సమస్యలు.. ఎక్కువ హార్మోన్స్ విడుదల చేస్తే ఒక రకమైన సమస్యలు వస్తాయి. థైరాయిడ్ టెస్ట్ చేయించుకుని దాని ప్రకారం మందులు వాడాలి.
సాధారణంగా థైరాయిడ్ సమస్య ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. థైరాయిడ్ సమస్యను తగ్గించటానికి ధనియాలు చాలా బాగా సహాయపడతాయి.
ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను ధనియాలు వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తేనె కలుపుకొని తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.
అయితే డాక్టర్ సూచన ప్రకారం మందులను వాడుతూ ఈ ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఫలితం చాలా తొందరగా వస్తుంది. ధనియాలో ఉండే పోషకాలు థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరిచి సమస్య తీవ్రతను తగ్గించడానికి సహాయపడతాయి.
ధనియాలు మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయ్యి థైరాయిడ్ సమస్యను తగ్గించుకోండి. అలాగే థైరాయిడ్ సమస్య కారణంగా వచ్చే అధిక బరువుకు కూడా చెక్ పెడుతుంది.
ఇవి కూడా చదవండి:
- Hair Growth Tips: జీవం లేని మీ జుట్టుకు అమృతం లాంటి చిట్కా.. నెల రోజుల్లోనే జుట్టు దట్టంగా!
- ఫంక్షన్కు వెళ్లే 10 నిమిషాల ముందు ఇది రాసుకోండి.. బ్యూటీ పార్లర్ వెళ్లినట్లే మీ ముఖం మెరిసిపోతుంది!
ఏదైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్ సూచన ప్రకారం మందులను వాడటం మాత్రం మానకూడదు. ఇలా మందులు వాడుతూ ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఉపసమనం చాలా తొందరగా వస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

