Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

గుండె పదిలంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పక తినాల్సిందే! మీ డైట్‌లో ఉన్నాయా?

CHAI PaKODi 3 weeks ago

మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో గుండె సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. అయితే, మన డైట్‌లో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను చేర్చుకోవడం ద్వారా హార్ట్ ఎటాక్ వంటి ముప్పును చాలా వరకు తగ్గించవచ్చు.

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆ సూపర్ ఫుడ్స్ ఏమిటి? వాటిని మీరు రోజూ తింటున్నారా లేదా? పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

మనిషి శరీరంలో ముఖ్యమైన మరియు సున్నితమైన అవయవం గుండె. గుండెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి గుండె సమస్యలు వస్తున్నాయి.

ఈ సమస్యలు రావటానికి జీవనశైలి బిజీగా మారటం,సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం మరియు పోషకారాహాన్ని వదిలి జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వంటివి కారణాలుగా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

చేప:ఇందులో ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్) ఎక్కువగా ఉంటాయి. సల్మాన్, టూనా, హెర్రింగ్, మాకేరెల్, ట్రౌట్ రకాల చేపల్లో ఈ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

ఓట్స్:శరీరంలో కొలస్ట్రాల్ ఎక్కువైతే గుండెకు ప్రమాదం. ఓట్స్‌లో ఉండే ఫైబర్ శరీరంలోని చెడు కొలస్ట్రాల్ ని తొలగిస్తుంది. శరీరంలో కొలెస్టరాల్ తగ్గించేందుకు ఓట్స్ ఉపయోగపడతాయి

నట్స్:నట్స్ లో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి మీ గుండెకు మేలు చేస్తాయి. గుండెలోని ధమనుల వాపు సమస్యను తగ్గిస్తుంది.

బెర్రీలు:ఇందులో గుండెకు మేలు చేసే పెతోన్యూట్రియంట్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్‌బెర్రీస్ వంటివి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే గుండెకు మంచిది.

కూరగాయలు:కూరగాయల్లో ఉండే కెరోటినాయిడ్‌లు, విటమిన్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఆరెంజ్ జ్యూస్ –ఇంటిలో తయారు చేసిన తాజా ఆరెంజ్ రసం లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తనాళాలలోని గడ్డలను కరిగిస్తాయి. ప్రతిరోజూ ఒక్క గ్లాసెడు ఆరెంజ్ జ్యూస్ త్రాగితే గుండె ఆరోగ్యానికి మంచిది.

బీరకాయ తినని వారు కూడా లొట్టలేసుకుంటూ తినే 'బీరకాయ శనగపప్పు మసాలా' కర్రీ!

వెల్లుల్లి –వెల్లుల్లిలో మంచి కొలస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తనాళాలలోని లోపలి అంచులు గట్టి పడకుండా చేస్తుంది. రక్తనాళాలు కొల్లెస్టరాల్ రహితంగా చేయటమే కాకుండా శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతిరోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే ఎంతో మేలని వైద్య నిపుణులు అంటున్నారు.

పెసలు
రక్తంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించివేయడంలో పెసలు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ప్రతి రోజు పెసలను నానబెట్టుకుని మొలకెత్తించి లేదా ఉడకబెట్టి తింటుంటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దాంతో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

అవిసెలు
అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక ఫైబర్, ఫైటోఈస్టోజెన్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. అవిసె గింజలను నీటిలో నానబెట్టుకుని తినవచ్చు. లేదా పొడి చేసుకొని ప్రతి రోజు తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi