టాలీవుడ్ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు మ్యాన్లీ హీరోగా, ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన ఆయన.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నెగెటివ్ రోల్స్‌తో విభిన్న పాత్రల్లో దూసుకుపోతున్నారు.
ఇక వీరి పెద్ద కుమారుడు రోషన్ ఇప్పటికే ‘ఛాంపియన్’ సినిమాతో ఆకట్టుకోగా.. త్వరలో ‘ఏమో ఏమో ఇది’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోవైపు చిన్న కొడుకు కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే అందరి దృష్టి ఇప్పుడు శ్రీకాంత్ కూతురు ‘మేద’ (Medha) పై పడింది. ఇంతకీ ఆమె ఏం చదువుతోంది? ఏం చేయబోతోంది?
సినిమాలపై ఆసక్తి లేదు..
ఆ మధ్య తిరుమలలో కుటుంబ సమేతంగా కనిపించిన మేద.. చూడటానికి అచ్చం హీరోయిన్‌లా చాలా అందంగా ఉంటుంది. సినిమాల్లోకి వస్తే ఆమె క్రేజ్ వేరే లెవల్ లో ఉంటుందని అభిమానులు అనుకుంటారు.
కానీ, ఆమెకు యాక్టింగ్, సినిమాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని శ్రీకాంత్ గతంలోనే స్పష్టం చేశారు. పిల్లల ఇష్టాలను తాను కాదననని, వారిని ఫోర్స్ చేయనని చెప్పారు. మేద ఎక్కువగా లైమ్‌లైట్‌కు దూరంగా, పూర్తి ప్రైవేట్ లైఫ్ గడపడానికే ఇష్టపడుతుంది.
:మీ పుట్టిన తేదీ ప్రకారం ఏ గుడికి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా?
:రొటీన్ సమోసాలకు బదులు భిన్నంగా 'పిజ్జా బ్రెడ్ సమోసా'.. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ అడుగుతారు
కెనడాలో ఉన్నత విద్య..
మేద ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లింది. కెనడాలోని ప్రతిష్టాత్మక ‘యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా’ నుంచి ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. ఈ ఏడాది సమ్మర్‌లోనే ఆమె తన గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పంచుకుంది. ప్రస్తుతం హయ్యర్ స్టడీస్ పై ఆమె దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
నేషనల్ లెవెల్ ప్లేయర్.. డాన్సర్ కూడా!
మేద గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్ని తల్లి ఊహ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మేదకు క్రీడలంటే చాలా ఇష్టమని, ఆమె నేషనల్ లెవెల్ బాస్కెట్ బాల్ ప్లేయర్ అని తెలిపారు. అలాగే స్పోర్ట్స్ కంటే డాన్స్ అంటే ఇంకా ప్రాణం అని, ఆమె అద్భుతంగా డాన్స్ చేస్తుందని ఊహ వెల్లడించారు.
వ్యాపార రంగం వైపు అడుగులు..
మేద సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటూ, వ్యాపార రంగంలో స్థిరపడాలని భావిస్తోందట. ఇప్పటికే ఆమె అక్కడ ఓ బిజినెస్ కూడా నిర్వహిస్తున్నట్లు ఊహ చెప్పారు. మొత్తానికి శ్రీకాంత్ కూతురు సిల్వర్ స్క్రీన్ కు బదులుగా.. విదేశాల్లోనే బిజినెస్ ఉమెన్‌గా సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

