Onion Kurma:ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు.. రాత్రికి చపాతీలు చేసుకుందాం అంటే నంచుకోవడానికి ఏం కర్రీ చేయాలో అర్థం కావట్లేదా? అయితే ఈసారి ఈ స్పైసీ 'ఉల్లిపాయ కుర్మా' ట్రై చేయండి!
కేవలం ఇంట్లో ఉండే ఉల్లిపాయలు, మసాలాలతోనే పది నిమిషాల్లో అయిపోతుంది.
వేడివేడి చపాతీల్లోకి ఈ కారంగా, ఘాటుగా ఉండే కుర్మా వేసుకుని తింటే అబ్బా.. రుచి వేరే లెవెల్ అంతే! చాలా సులభంగా, టేస్టీగా దీన్ని ఎలా తయారుచేసుకోవాలో ఈ బ్లాగ్‌లో క్లియర్ గా రాశాను. ఒకసారి చేసి చూడండి, ఇంట్లో వాళ్లంతా మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు!
ఉల్లిపాయలేని కూర ఉండదు,ఉల్లి లేని ఇల్లు ఉండదు. ఆలు,టమాటో కుర్మాలా ఉల్లి కుర్మాను కూడ ఎలా తయారు చెయ్యాలో చూసేయండి.
కావాల్సిన పదార్ధాలు
ఉల్లిపాయ పేస్ట్ కోసం..
నూనె - 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు - 1 కప్పు
ఎండు కొబ్బరి పొడి - 3 టేబుల్ స్పూన్స్
జీడిపప్పు - 7-8
నువ్వులు - 1 టేబుల్ స్పూన్
కుర్మా కోసం..
నూనె 3 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 టేబుల్ స్పూన్స్
ఉప్పు - తగినంత
కారం - 1.5 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
గరం మసాలా - 1 టేబుల్ స్పూన్
పసుపు - 2 చిటికెలు
టమాటో - 2
ఉల్లిపాయలు - 2
చింతపండు - ఉసిరికాయంత
కొత్తిమీర - కొద్దిగా
నొప్పులన్నీ మాయం చేసే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా.. ఎలా తయారు చేయాలి?
తయారీ విధానం
1.కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయముక్కలు,కొబ్బరి పొడి,,జీడిపప్పు,నువ్వులు,వేసి దోరగా వేగనివ్వాలి.
2.వేగిన పదార్ధాలను నీళ్లు కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
3.కుర్మా కోసం నూనె వేడి చేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్,ఉప్పు,కారం,ధనియాల పొడి ,జీలకర్ర పొడి ,గరం మసాల ,పసుపు వేసి వేపుకోవాలి.
4.వేగిన మసాలలో టమాటో పేస్ట్ వేసి మీడియం ప్లేమ్ పై దగ్గరపడనివ్వాలి.
చూడటానికి చిన్నగా ఉన్నా.. లాభాల్లో ఈ కాయలు బంగారంతో సమానం!
5.వేగిన టమాటో ఉల్లిపాయ ముక్కలు వేసి 4-5 నిమిషాలు మగ్గనివ్వాలి.
6.మగ్గిన ఉల్లిపాయల్లో చింతపండు పులుసు వేసి నూనె పైకి తేలేవరకు వేపుకోవాలి.
7. ఇప్పుడు అందులోకి కుర్మా పేస్ట్ యాడ్ చేసి నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మరగనివ్వాలి.
8.చివరగా కొత్తిమీర తరుగు వేసుకోని స్టవ్ ఆఫ్ చేసుకోని సర్వ్ చేసుకోవడమే..

