Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఇంట్లో ఉండే వాటితోనే తెల్ల జుట్టును న్యాచురల్ గా నల్లగా మార్చుకోండిలా!

CHAI PaKODi 1 month ago

White Hair To Black Hair Home Remedy in Telugu : మారుతున్న జీవనశైలి, వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ‘తెల్ల జుట్టు’ (White Hair).

మార్కెట్లో దొరికే రంగులు, హెయిర్ డైలు వాడితే జుట్టు డ్యామేజ్ అవ్వడమే కాకుండా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

అయితే, ఎలాంటి రసాయనాలు (Chemicals) లేకుండా మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన వస్తువులతోనే తెల్ల జుట్టును నల్లగా, ఒత్తుగా ఎలా మార్చుకోవచ్చో ఈ పోస్ట్‌లో వివరంగా చూద్దాం. ఖర్చు లేకుండా చేసుకునే ఈ సింపుల్ చిట్కాతో మీ జుట్టు సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు!

ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులో వచ్చేస్తుంది. దాంతో చాలా మంది కంగారూ పడి మార్కెట్ లో దొరికే రకరకాల hair dye లు వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంటిలో సహజసిద్దంగా ఉండే కొన్ని వస్తువులతో తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఈ చిట్కా కోసం ఉసిరి ముక్కలను తీసుకొని ఒక పాన్ లో వేసి పొయ్యి మీద పెట్టి సిమ్ లో 5 నిమిషాల పాటు వెగించాలి. వేగిన తర్వాత కొంచెం నీటిని పోసి ఉసిరి ముక్కలను బాగా ఉడికించాలి. ఉసిరి ముక్కలు ఉడకటానికి దాదాపుగా 7 నిమిషాల సమయం పడుతుంది. బాగా ఉడికిన ఉసిరి ముక్కలను రాత్రంతా అలా ఉంచేయాలి.

అరటి తొక్కతో ముఖాన్ని 5 నిమిషాల్లో కాంతివంతంగా మార్చే సహజ చిట్కా

మరుసటి రోజు ఉదయం ఉడికిన ఉసిరి ముక్కలను మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఉసిరి ముక్కల పేస్ట్ లో ఒక స్పూన్ గోరింట పొడి, అరస్పూన్ కాఫీ పొడి వేసి బాగా కలిపి తలకు పట్టించి గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

జుట్టు విపరీతంగా రాలుతోందా? కరివేపాకు నూనెను ఇలా వాడితే 15 రోజుల్లో ఒత్తైన, నల్లని జుట్టు గ్యారెంటీ!

ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. తెల్లజుట్టు ఎక్కువగా ఉన్నవారికి ఎక్కువ వారాలు, తెల్ల జుట్టు తక్కువగా ఉన్నవారికి తక్కువ వారాల సమయం పడుతుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi