Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జలుబు, దగ్గును ఇట్టే మాయం చేసే ఘాటైన మిరియాల పులుసు!

జలుబు, దగ్గును ఇట్టే మాయం చేసే ఘాటైన మిరియాల పులుసు!

CHAI PaKODi 2 months ago

Miriyala Pulusu:వాతావరణం కాస్త చల్లబడినా, వాన పడుతున్నా మనకు ముందుగా గుర్తొచ్చేది వేడి వేడి అన్నంలోకి కమ్మని చారు! అందులోనూ జలుబు, దగ్గు లేదా గొంతు నొప్పిగా ఉండి నోరు బాలేనప్పుడు ఈ 'మిరియాల పులుసు' అమృతంలా అనిపిస్తుంది.

మిరియాల ఘాటు, చింతపండు పులుపు కలిసిన ఈ పులుసు నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా ఒంటికి ఎంతో హాయినిస్తుంది. దీన్ని చేయడం కూడా చాలా తేలిక. ఇంట్లోనే సులభంగా, అచ్చమైన ఆంధ్రా స్టైల్‌లో ఘాటైన మిరియాల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఒంటికి హాయినిచ్చే ఘాటైన మిరియాల పులుసు.. మిరియాల పులుసును వారంలో రెండు సార్లు చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో అనారోగ సమస్యలకు పరిష్కారం చూపుతుంది.

కావాల్సిన పదార్ధాలు
మిరియాల పేస్ట్ కోసం..
మిరియాలు - 2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
ధనియాలు - 1.5 టేబుల్ స్పూన్
పెసరపప్పు - లేదా - శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
మెంతులు - 1/4టేబుల్ స్పూన్
బియ్యం - 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి - 8 నుంచి 10
పచ్చి కొబ్బరి - 1/4కప్పు
కరివేపాకు - 1 రెమ్మ

పులుసు కోసం ..
నూనె - 3 టేబుల్ స్పూన్స్
ఆవాలు - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
ఇంగువ - 2 చిటికెలు
సాంబార్ ఉల్లిపాయలు - 1 కప్పు
వెల్లుల్లి - 10
ఉప్పు - తగినంత
పసుపు - 1/4టీ స్పూన్
టమాటోలు - రెండు
చింతపుండు పులుసు - 300ML
నీళ్లు - 400ML

Hair Growth Secret: గంజిలో ఈ 2 వస్తువులు కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం!

తయారీ విధానం
1.మిరియాల పేస్ట్ కోసం తీసుకున్న పదార్ధాలు అన్ని వేసి, సన్నని సెగపై , ఎర్రగా వేపుకోవాలి.
2. వేగిన పప్పులను, నీళ్లు యాడ్ చేసి, మిక్సీ జార్ లోకి వేసుకుని, పేస్ట్ లా చేసుకోవాలి.
3. నూనె వేడి చేసిన తర్వాత, అందులోకి ఆవాలు, కరివేపాకు, ఇంగువ, వేసి వేపుకోవాలి.
4. తర్వాత ఉల్లి పాయలు, పసుపు, ఉప్పు వేసి, ఉల్లిపాయ మెత్తపడే వరకు వేపుకోవాలి.

5. అందులోకి టమాటో ముక్కలు కూడా వేసి, మెత్త పడే వరకు మగ్గనివ్వాలి.
6. మగ్గిన టమాటాల్లోకి చింతపండు పులుసు పోసి, రెండు పొంగులు రానివ్వాలి,
7. పొంగుతున్న పులుసులో మిరియాల పేస్ట్ , నీళ్లు వేసి మూత పెట్టుకుని, 15 నిముషాలు సన్నని సెగపై మరగనివ్వాలి.
8. బాగా మరిగిన పులుసు లోకి, అవసరం బట్టి, ఉప్పు, కారాలు వేసుకుని, బెల్లం కూడా యాడ్ చేసుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
9. అంతే మిరియాల పులుసు తయార్.

ఒక్క స్పూన్ పొడితో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కు శాశ్వతంగా చెక్ పెట్టండి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi