Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జుట్టు రాలడానికి చెక్ పెట్టే మ్యాజికల్ పౌడర్.. నీటిలో కలిపి తాగితే చాలు!

జుట్టు రాలడానికి చెక్ పెట్టే మ్యాజికల్ పౌడర్.. నీటిలో కలిపి తాగితే చాలు!

CHAI PaKODi 1 week ago

మారిన జీవనశైలి, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం, జుట్టు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవటం వంటి అనేక రకాల కారణాలతో వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలే సమస్య అనేది ప్రతి ఒక్కరిలోనూ కనబడుతోంది.

జుట్టు రాలే సమస్యకు హెయిర్ ప్యాక్లు వాడుతూ ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తాగితే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

వేలకొద్ది డబ్బులను ఖర్చుపెట్టి మార్కెట్లో దొరికే ఉత్పత్తులను అసలు వాడాల్సిన అవసరం లేదు. కాస్త శ్రద్ధ పడితే మన ఇంటిలోనే సహజ సిద్ధంగా పౌడర్ ను తయారు చేసుకోవచ్చు.

ఒక బౌల్లో రెండు స్పూన్ల ఉసిరి పొడి, రెండు స్పూన్ల బృంగరాజ్ పౌడర్, రెండు స్పూన్ల బ్రహ్మీ పౌడర్, రెండు స్పూన్ల అశ్వగంధ పౌడర్, రెండు ఫోన్ల సంకపుష్పి పౌడర్ వేసుకొని అన్ని బాగా కలిసేలా కలుపుకొని ఒక సీసాలో నిలువ చేసుకోవాలి.

ఈ పొడి దాదాపుగా నెల రోజులు పాటు నిల్వ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు నీటిలో పావు స్పూను పొడి వేసి బాగా కలిపి పరగడుపున తాగాలి. అయితే గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తాగకూడదు.

ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన పావుగంట తర్వాత తాగవచ్చు. ఈ పొడిని త్రాగటం ప్రారంభించాక దాదాపుగా నెల రోజులకు మీ జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

ఈ పౌడర్స్ అన్ని ఆయుర్వేద షాపులో లభ్యమవుతాయి. లేదంటే ఆన్లైన్ స్టోర్ లో కూడా లభ్యమవుతాయి. ఇంటి చిట్కాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. కాకపోతే కాస్త సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి:

అలాగే కాస్త ఓపికగా చేసుకోవాలి. అప్పుడే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పని చేస్తాయి. జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా తెల్ల జుట్టు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi