Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలంటే మందారంతో ఇలా చేయండి!

జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలంటే మందారంతో ఇలా చేయండి!

CHAI PaKODi 1 week ago

Mustard Seeds Hair Fall Tips In Telugu :ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. నల్లని,ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.

కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితుల కారణంగా జుట్టు రాలే సమస్య ను మనలో చాలా మంది ఎదుర్కొంటున్నారు.

జుట్టు రాలే సమస్య కోసం మార్కెట్లో దొరికే ఏ ప్రొడక్ట్ అవసరం లేదు. మన ఇంట్లో సహజసిద్ధంగా తయారు చేసుకున్న నూనె సరిపోతుంది. ఈ నూనెను ఒకసారి తయారుచేసుకుంటే నెల రోజుల పాటు వాడవచ్చు.

దీని కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి పావు లీటర్ కొబ్బరి నూనె వేసి దానిలో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, పది లవంగాలు, ఒక ఇంచు అల్లం ముక్క, 4ఎర్ర మందార పువ్వులు,12 మందార ఆకులు, గుప్పెడు కరివేపాకు వేసి బాగా మరిగించాలి.

Also Read:షుగర్ కంట్రోల్ అవ్వట్లేదా? ఈ ఆకులను ట్రై చేయండి, ఫలితం మీరే చూస్తారు!

ఈ నూనె బాగా మరిగాక వడగట్టుకుని సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను వారానికి రెండుసార్లు తలకు అప్లై చేసి రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.

ఈ విధంగా కొన్ని వారాల పాటు చేస్తూ ఉంటే క్రమంగా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే తెల్లజుట్టు సమస్య కూడా తొలగిపోయుండి. ఈ నూనె జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరిగేలా చేస్తుంది. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

Also Read:Face Glow Tips: కాఫీ పొడిలో ఇది కలిపి రాస్తే.. ముఖం కాంతివంతంగా మెరవడం పక్కా!

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Also Read:White Hair: ఈ అద్భుతమైన నూనెతో మీ తెల్ల జుట్టుకు శాశ్వతంగా చెక్ పెట్టండి!

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi