Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాలి పగుళ్లతో నరకం చూస్తున్నారా? ఇంట్లోని ఈ 3 వస్తువులతో శాశ్వతంగా చెక్ పెట్టండి..

కాలి పగుళ్లతో నరకం చూస్తున్నారా? ఇంట్లోని ఈ 3 వస్తువులతో శాశ్వతంగా చెక్ పెట్టండి..

CHAI PaKODi 1 month ago

కాలి పగుళ్లతో నరకం చూస్తున్నారా? ఇంట్లోని ఈ 3 వస్తువులతో శాశ్వతంగా చెక్ పెట్టండి..పగిలిన మడమలు (Cracked Heels) చూడ్డానికి అసహ్యంగా ఉండటమే కాకుండా, నడిచేటప్పుడు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.

చర్మం పొడిబారడం, పాదాలపై ఒత్తిడి పెరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఒక్కోసారి పగుళ్లు తీవ్రమై రక్తం కూడా వస్తుంటుంది.

దీనికోసం చాలామంది మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీమ్స్, ఇంగ్లీష్ మందులు వాడుతుంటారు. వాటి వల్ల తాత్కాలిక ఉపశమనం దొరికినా, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. కానీ, మన వంటింట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతో కాలి పగుళ్లను శాశ్వతంగా మాయం చేయవచ్చు. ఆ అద్భుతమైన చిట్కా ఏంటో ఇప్పుడు చూద్దాం!

ఈ మ్యాజిక్ చిట్కాకు కావాల్సినవి:
బియ్యం పిండి: 1 టేబుల్ స్పూన్
తేనె: 1/2 స్పూన్
ఆపిల్ సీడర్ వెనిగర్: 1 స్పూన్

ఇంకా చదవండి:

జుట్టు రాలుతోందా? చుండ్రు వేధిస్తోందా? మీ ఇంట్లోనే ఈ నూనెను తయారు చేసి వాడి చూడండి.. రిజల్ట్ పక్కా!

తయారీ మరియు వాడే విధానం:
ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి, తేనె, ఆపిల్ సీడర్ వెనిగర్ వేసి ఎలాంటి ఉండలు లేకుండా మెత్తని పేస్ట్‌లా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న టబ్‌లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని, అందులో మీ పాదాలను కనీసం 10 నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల పాదాల చర్మం మృదువుగా మారుతుంది.

ఆ తర్వాత పాదాలను పొడి గుడ్డతో శుభ్రంగా తుడిచి, ముందుగా తయారుచేసుకున్న పేస్ట్‌ను పగుళ్లు ఉన్న చోట రాసి ఒక నిమిషం పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. అలా రాసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు ఆరనిచ్చి, ఆపై నీటితో శుభ్రంగా కడిగేయాలి.

ఇంకా చదవండి:

ముఖంపై నల్లటి మచ్చలు వేధిస్తున్నాయా? పంచదారతో ఇలా చేస్తే మీ చర్మం తళతళలాడటం ఖాయం!

గమనిక:
ఈ చిట్కాను రోజు విడిచి రోజు (Alternate Days) క్రమం తప్పకుండా పాటిస్తే చాలు. తేనె మరియు వెనిగర్ పాదాలకు సహజమైన తేమను అందించి చర్మాన్ని రిపేర్ చేస్తాయి. కొద్ది రోజుల్లోనే మీ కాలి పగుళ్లు పూర్తిగా మాయమై, పాదాలు మృదువుగా, అందంగా మారతాయి.

ఇంకెందుకు ఆలస్యం, ఎన్నో క్రీమ్స్ వాడి విసిగిపోయిన వారు వెంటనే ఈ న్యాచురల్ రెమెడీని ట్రై చేయండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi