Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేవలం 10 నిమిషాల్లో.. రాత్రి మిగిలిన అన్నంతో ఇంట్లోనే కరకరలాడే వడియాలు!

కేవలం 10 నిమిషాల్లో.. రాత్రి మిగిలిన అన్నంతో ఇంట్లోనే కరకరలాడే వడియాలు!

CHAI PaKODi 1 week ago

సాధారణంగా రాత్రి సమయంలో అన్నం మిగలటం జరుగుతూనే ఉంటుంది. కొంతమంది ఆ అన్నాన్ని పడేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది పులిహార, అన్నం తాలింపు, టమాటా రైస్ వంటివి చేస్తూ ఉంటారు.

అలా కాకుండా ఇప్పుడు మనం మిగిలిన అన్నంతో క్రిస్పీ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

ఈ వడియాలు పప్పు, సాంబార్, రసం వంటి వాటికి సైడ్ డిష్ గా ఉంటుంది. అలాగే టీ టైంలో స్నాక్ గా కూడా ఉంటుంది.

అన్నం వడియాలు తయారీకి కావాల్సిన పదార్థాలు
మిగిలిన అన్నం
నువ్వులు
జీలకర్ర
ఉప్పు
కొత్తిమీర
నీళ్లు
టమాటాలు
పసుపు
కారం

తయారీ విధానం
ఒక కప్పు అన్నంలో ఒక కప్పు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి మరిగించాలి. అన్నం మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికిన తర్వాత దానిలో టమాటా పేస్ట్, పసుపు, జీలకర్ర, నువ్వులు, కారంపొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించాలి.

అన్నం బాగా ఉడికిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి అన్నం మిశ్రమాన్ని కొంచెం కొంచెం గా తీసుకొని అప్పడాలు లాగా ఒక ప్లాస్టిక్ కవర్ పై ఒత్తుకోవాలి. రెండు రోజులు ఎండలో పెడితే ఎండిపోతాయి. ఈ వడియాలను గాలి చొరబడి డబ్బాలో పెట్టుకుంటే దాదాపుగా 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. వీటిని డీప్ ఫ్రై చేసుకుని తినడమే..

ఇవి కూడా చదవండి:

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi