Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేవలం 3 సార్లు వాడితే చాలు.. దగ్గు, జలుబు, కఫం తక్షణమే మాయం!

కేవలం 3 సార్లు వాడితే చాలు.. దగ్గు, జలుబు, కఫం తక్షణమే మాయం!

CHAI PaKODi 1 month ago

Home Remedies for Cough and Cold In Telugu :ఎన్ని మందులు వాడినా మొండి దగ్గు, జలుబు, ఛాతిలో పేరుకుపోయిన కఫం తగ్గడం లేదా? అయితే ఈ సహజమైన ఇంటి వైద్యం మీకోసమే..

కేవలం 3 సార్లు దీన్ని వాడితే గొంతు నొప్పి తగ్గిపోయి, కఫం కరిగిపోతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ అద్భుతమైన చిట్కా ఎలా తయారుచేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం

ఏ కాలంలోనైనా వాతావరణం మారగానే… చాలా మందికి వ్యాపించే అనారోగ్య సమస్యల్లో దగ్గు, జలుబు కామన్. వాటిని లైట్ తీసుకుంటే చాలా రోగాలకు దారితీస్తాయి.

అందుకే వాటిని వెంటనే తగ్గించుకొనే మార్గాలు గురించి ఆలోచించాలి. దగ్గు,జలుబు వచ్చాయంటే ఒక పట్టాన వదలవు. ఇవి లేకపోతె చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు ఫిల్ అవుతాం.

గొంతులో తేడాగా ఉన్నా ముక్కులో గడబిడ ఉన్నా చాలా చిరాకుగాను నిసత్తుగాను ఉంటుంది. దగ్గు,జలుబు తగ్గేదాకా ప్రశాంతత ఉండదు. ఇవి శరీరంలో సమస్యలకు కారణం అవుతాయి. దగ్గు,జలుబుతో పాటు తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఇలా ఒక్కొకటి వచ్చేస్తూ ఉంటాయి.కాబట్టి… దగ్గు, జలుబు రాగానే మనం అలర్ట్ అవ్వాలి.

చేతులకు వెల్లుల్లి వాసన వస్తోందా? అయితే ఈ సింపుల్ చిట్కాలతో ఇట్టే మాయం చేయండి!

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో చిన్న అల్లం ముక్క, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క లేదా దాల్చినచెక్క పొడి వేసి 6 నుంచి 7 నిమిషాల పాటు సిమ్ లో మరిగించాలి. మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి దానిలో అరస్పూన్ తేనె కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.

ఈ విధంగా ఉదయం, సాయంత్రం తాగితే దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అల్లం, లవంగాలు, దాల్చినచెక్క, తేనెలలో రోగనిరోదక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. దగ్గు ఉన్నప్పుడూ 3 రోజులు తాగితే సరిపోతుంది. ఈ డ్రింక్ ని ఈ సీజన్ లో కూడా రెండు రోజులకు ఒకసారి తాగితే ఇమ్మునిటీ పవర్ పెరుగుతుంది.

వారంలో 2 సార్లు ఈ నూనె రాస్తే చాలు.. ఇక జీవితంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యే ఉండదు!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi