Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఖరీదైన పార్లర్ ట్రీట్‌మెంట్స్ వద్దు.. ఈ న్యాచురల్ మాస్క్‌తో సిల్కీ హెయిర్ మీ సొంతం.

ఖరీదైన పార్లర్ ట్రీట్‌మెంట్స్ వద్దు.. ఈ న్యాచురల్ మాస్క్‌తో సిల్కీ హెయిర్ మీ సొంతం.

CHAI PaKODi 1 month ago

Rice And Hibiscus hair Mask:మీ జుట్టు డ్రైగా, నిర్జీవంగా ఉందా? ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఈ మ్యాజికల్ హెయిర్ మాస్క్‌తో మీ జుట్టును పట్టులా మెరిసేలా మార్చుకోండి.

సిల్కీ అండ్ స్మూత్ హెయిర్ కోసం బెస్ట్ న్యాచురల్ టిప్స్ ఇక్కడ చదవండి.

ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సమస్య రాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల షాంపూలు,నూనెలను వాడుతూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సులభంగా దొరికే సహజసిద్దమైన పదార్ధాలను ఉపయోగించి చాలా సులభంగా ఈ సమస్య నుండి బయట పడవచ్చు.

మూడు స్పూన్ల బియ్యాన్ని కడిగి నీటిని పోసి ఉడికించి ఆ నీటిని వడకట్టాలి. ఆ తర్వాత 4 మందార పువ్వులను రేకలుగా విడతీయాలి. 4 మందార ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మందార పువ్వులు దొరక్కపోతే మందార మొగ్గలను వాడవచ్చు. మందార పువ్వు రేకలను,ఆకులను కచ్చా పచ్చాగా దంచాలి.

ఒక సీసాలో గోరువెచ్చగా ఉన్న బియ్యం నీటిని పోయాలి. ఆ తర్వాత మందార మిశ్రమాన్ని వేసి బాగా కలిపి రెండు గంటలు అలా వదిలేయలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక సాదరణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. మరుసటి రోజు జుట్టుకి నూనెను రాసి మసాజ్ చేయాలి.

7 రోజుల్లో స్లిమ్ అవ్వండి: పొట్ట మరియు నడుము కొవ్వును కరిగించే చిట్కా

ఆ తర్వాత కుంకుడు కాయలు లేదా రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. మందార ఆకులు,పువ్వులు దాదాపుగా అందరికీ అందుబాటులో ఉంటాయి. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఎర్ర మందార పువ్వులను మాత్రమే ఉపయోగించాలి.

కేవలం 3 రోజుల్లో వేలాడే పొట్ట, నడుము కొవ్వు మైనంలా కరగాలంటే ఇలా చేయండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi