Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టే 'రోవాన్ బెర్రీ'.. దీని అద్భుత ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!

కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టే 'రోవాన్ బెర్రీ'.. దీని అద్భుత ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!

CHAI PaKODi 4 months ago

కిడ్నీలో రాళ్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు.. ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్యలు. అయితే వీటికి న్యాచురల్‌గా చెక్ పెట్టే ఒక అద్భుతమైన పండు ఉందన్న విషయం మీకు తెలుసా?

అదే ‘రోవాన్ బెర్రీ’ (Rowan Berry).

ఆపిల్ జాతికి చెందిన ఈ పండు ఒకప్పుడు చాలా అరుదుగా దొరికేది. కానీ, ఇప్పుడు ఆన్‌లైన్ స్టోర్లలో డ్రై ఫ్రూట్‌ రూపంలో విరివిగా లభిస్తోంది.

విటమిన్ సి, ఇ, సోర్బిక్ ఆమ్లం, డైటరీ ఫైబర్, ఆంథోసైనిన్స్, పాలీఫెనోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉండే ఈ పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోవాన్ బెర్రీతో అద్భుతమైన ఆరోగ్య లాభాలు:
కిడ్నీ, పిత్తాశయ రాళ్లకు చెక్: ఈ పండు మూత్ర మార్గాన్ని శుభ్రపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కిడ్నీలో, పిత్తాశయంలో ఏర్పడే రాళ్లను కరిగించడంతో పాటు, మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంట నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

ఇమ్యూనిటీ బూస్టర్:రోవాన్ బెర్రీ పండ్లతో టీ తయారుచేసుకొని తాగితే.. శరీరంలో రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. అలాగే సీజనల్‌గా వచ్చే శ్వాసకోశ సమస్యలు తగ్గుముఖం పడతాయి.

క్యాన్సర్‌కు అడ్డుకట్ట: ఇందులో ఉండే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలతో తీవ్రంగా పోరాడుతాయి. అవి శరీరంలో వృద్ధి చెందకుండా అడ్డుకోవడంలో ఇవి సహాయపడతాయి.

గుండె భద్రం:ఈ పండ్లలో పుష్కలంగా ఉండే ‘టానిన్’లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Also Read:

పార్టీకి వెళ్లే 5 నిమిషాల ముందు ఇలా చేస్తే.. మీ ముఖం పాలలా మెరిసిపోవడం ఖాయం!

కంటి చూపు మెరుగు:డిజిటల్ స్క్రీన్ల వల్ల కంటిపై పడే ఒత్తిడిని తగ్గించి, కంటి చూపును మెరుగుపరచడంలో ఈ పండులోని పోషకాలు ఎంతగానో సహాయపడతాయి.

చర్మ సౌందర్యం:ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సోర్బిక్ మరియు ఆస్కార్బిక్ ఆమ్లాలు చర్మాన్ని ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతూ, ఆరోగ్యంగా రక్షిస్తాయి.

కేవలం ఈ పండ్లు మాత్రమే కాదు.. ఈ రోవాన్ బెర్రీ మొక్క బెరడు, ఆకులు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మీ రోజువారీ డైట్‌లో వీటిని చేర్చుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

Also Read:

Hair Care Tips: షాంపూలో ఇవి కలిపి తలస్నానం చేస్తే చాలు.. జుట్టు రాలడం ఆగి, పట్టుకుచ్చులా పెరుగుతుంది!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi