Migraine Headache Home Remedies :మైగ్రేన్ తలనొప్పికి తక్షణ ఉపశమనం: ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు.. మామూలుగా వచ్చే తలనొప్పిని కాస్త అశ్రద్ద చేసినా కానీ మైగ్రైన్ తలనొప్పిని అసలు అశ్రద్ద చేయకూడదు.
మైగ్రైన్ తలనొప్పి ప్రారంభంలో ఉన్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తలలోని రక్తనాళాల మీద ఒత్తిడితో మొదలయ్యే మైగ్రేన్ నొప్పి నరాలకు సంబంధించిన వ్యాధి. తలలో ఒక వైపు మాత్రమే వేధిస్తుంది. కాబట్టి పార్శ్వపు నొప్పి అని కూడా అంటారు. .
తరచూ వచ్చే ఈ నొప్పి తీవ్రత ఒక మోస్తరు నుంచి తీవ్రంగా ఉంటుంది. పురుషుల్లో కంటే స్త్రీలలో మూడు రెట్లు ఎక్కువగా మైగ్రైన్ తలనొప్పి వస్తుంది. ఈ నొప్పిని అసలు అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని సంప్రదించి మందులు వాడాలి. మందులు వాడుతూ ఇంటి చిట్కాలను ఫాలో అయితే తొందరగా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
Also Read:చుండ్రు, హెయిర్ ఫాల్‌కు శాశ్వత చెక్: జుట్టు 3 రెట్లు స్పీడ్‌గా పెరగాలంటే ఇలా చేయండి!
చిన్న అల్లం ముక్కను శుభ్రంగా కడిగి తొక్క తీసి మెత్తని పేస్ట్ గా చేసి రసం తీయాలి. ఈ రసం ఒక స్పూన్ ఉండేలా చూసుకోవాలి. ఈ రసంలో 5 మిరియాలను పొడిగా చేసి కలపాలి.
ఆ తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ఈ మిశ్రమం మొత్తంను ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే క్రమంగా మైగ్రైన్ తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
Also Read:లవంగాలతో తెల్ల జుట్టుకు చెక్: ఈ చిన్న ట్రిక్ తో నిమిషాల్లో నల్లగా మారడం ఖాయం!
అల్లం,మిరియాలు,నిమ్మరసం తలనొప్పిని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. తలనొప్పి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అలాగే పని ఎక్కువగా చేయకుండా విశ్రాంతిగా ఉండాలి. విటమిన్ సి, విటమిన్ డి, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
Also Read:ఏలూరు 'నేషనల్ మార్ట్' (National Mart): 365 రోజులూ ఆఫర్ల పండుగ!
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Source: chaipakodi.com

