Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీ బ్యాంక్ అకౌంట్‌లో 'జీరో బ్యాలెన్స్' ఉందా? ఫైన్ పడకముందే ఏ బ్యాంకులో ఎంత ఉంచాలో తెలుసుకోండి!

మీ బ్యాంక్ అకౌంట్‌లో 'జీరో బ్యాలెన్స్' ఉందా? ఫైన్ పడకముందే ఏ బ్యాంకులో ఎంత ఉంచాలో తెలుసుకోండి!

CHAI PaKODi 1 week ago

సేవింగ్స్ అకౌంట్ ఉందా? అయితే అందులో కనీస నిల్వ (Minimum Balance) మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. మీరు నివసించే ఏరియా (గ్రామీణ, పట్టణ, మెట్రో) మరియు ఖాతా రకాన్ని బట్టి ఈ నిబంధనలు మారుతుంటాయి.

బ్యాలెన్స్ తగ్గితే బ్యాంకులు మీ అకౌంట్ నుండి భారీగా జరిమానాలు వసూలు చేస్తాయి. మరి మన దేశంలోని ప్రధాన బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలో ఇక్కడ తెలుసుకోండి.

ప్రభుత్వ బ్యాంకుల నిబంధనలు (Government Banks)
గ్రామీణ, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ బ్యాంకులు ఎంతో అనుకూలంగా ఉంటాయి. వీటిలో కనీస నిల్వ పరిమితులు చాలా తక్కువ.

SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా):కస్టమర్లకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఎస్‌బీఐ సాధారణ సేవింగ్స్ ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు (జీరో బ్యాలెన్స్). ఇందులో అకౌంట్ ఉంటే ఫైన్ పడుతుందన్న టెన్షన్ అక్కర్లేదు.

యూనియన్ బ్యాంక్ (Union Bank):చెక్ బుక్ ఉంటే – గ్రామీణ ప్రాంతాల్లో రూ.250, సెమీ-అర్బన్ రూ.500, అర్బన్/మెట్రోల్లో రూ.1,000 ఉండాలి. చెక్ బుక్ లేకపోతే ఈ మొత్తంలో సగం ఉంచితే సరిపోతుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda):జీరో బ్యాలెన్స్ లేదు కానీ పరిమితులు తక్కువే. పల్లెల్లో రూ.500, పట్టణాల్లో రూ.1,000, మెట్రో నగరాల్లో రూ.2,000 ఉంచాలి.

బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India): గ్రామీణ సాధారణ ఖాతాలకు రూ.500, స్టార్ మహిళా ఖాతాకు రూ.5,000, సీనియర్ సిటిజన్లకు రూ.10,000 కనీస నిల్వ ఉండాలి.

ప్రైవేట్ బ్యాంకుల లిమిట్స్ (Private Banks)
ప్రైవేట్ బ్యాంకుల్లో ఆఫర్లు, సర్వీసులు బాగానే ఉన్నప్పటికీ మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ కొంచెం కఠినంగా ఉంటాయి.

HDFC బ్యాంక్:గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500, సెమీ-అర్బన్ రూ.5,000, పట్టణ/మెట్రో నగరాల్లో ఏకంగా రూ.10,000 మెయింటైన్ చేయాలి. జీరో బ్యాలెన్స్ సదుపాయం లేదు.

ICICI బ్యాంక్:పల్లెల్లో బ్రాంచ్‌ను బట్టి రూ.1,000 లేదా రూ.2,000, సెమీ-అర్బన్ రూ.5,000, మెట్రో సిటీలలో రూ.10,000 తప్పనిసరి.

యాక్సిస్ బ్యాంక్ (Axis Bank): పల్లెల్లో రూ.2,500, సెమీ-అర్బన్ రూ.5,000, మెట్రో ప్రాంతాల్లో ఏకంగా రూ.12,000 బ్యాలెన్స్ ఉంచాలి.

IDFC ఫస్ట్ బ్యాంక్: కస్టమర్లు ఎంచుకునే ఖాతా రకాన్ని బట్టి కనీసం రూ.10,000 లేదా రూ.25,000 అకౌంట్‌లో ఉండాలి.

ఎలాంటి కెమికల్స్ లేకుండా 5 నిమిషాల్లో మీ తెల్లజుట్టు నల్లగా…

ప్రత్యేక అకౌంట్లు ఉన్న బ్యాంకులు
కొన్ని బ్యాంకుల్లో ఖాతా రకాన్ని బట్టి (Account Type) బ్యాలెన్స్ రూల్స్ మారిపోతుంటాయి. అవేంటంటే..

కోటక్ మహీంద్రా (Kotak Mahindra):సంకల్ప్ ఖాతాకు రూ.2,500, నోవా ఖాతాకు రూ.5,000, ఎడ్జ్/క్లాసిక్ రూ.10,000, ఎవరీడే/ప్రో ఖాతాలకు రూ.20,000 మరియు ఏస్ అకౌంట్‌కు రూ.50,000 ఉంచాలి.

RBL బ్యాంక్:డిజిటల్/సీనియర్స్ ఫస్ట్ ఖాతాలకు రూ.5,000, ప్రైమ్ ఎడ్జ్/ఉమెన్స్ ఫస్ట్ ఖాతాలకు రూ.10,000, అడ్వాంటేజ్ ఖాతాకు రూ.25,000, రైజ్ ఖాతాకు రూ.50,000 మెయింటైన్ చేయాలి.

ముఖ్య గమనిక: కొత్తగా బ్యాంక్ అకౌంట్ తెరిచేముందు కేవలం వాళ్లిచ్చే ఆఫర్లు చూసి మోసపోకండి. మీ ఆర్థిక స్తోమతకు తగినట్లుగా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలిగే బ్యాంకును మాత్రమే ఎంచుకోండి!

ఒత్తైన, పొడవైన జుట్టు కోసం గుప్పెడు కుంకుడుకాయలతో ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi