Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మిగిలిపోయిన అన్నంతో అదిరిపోయే టమాటో పులావ్.. ఇలా చేస్తే ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారు!

మిగిలిపోయిన అన్నంతో అదిరిపోయే టమాటో పులావ్.. ఇలా చేస్తే ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారు!

CHAI PaKODi 1 month ago

Tomato Pulao recipe: రాత్రి అన్నం మిగిలిపోయిందా? పడేయడానికి మనసొప్పక, అలాగని చద్దన్నం తినలేక ఆలోచిస్తున్నారా? అయితే ఇంట్లో ఉన్న టమాటాలతో ఇలా వేడి వేడిగా, స్పైసీగా 'టమాటో పులావ్' చేసి చూడండి.

అప్పటికప్పుడు వండిన బిర్యానీలా దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేశారంటే.. ఈ టేస్ట్ కి ఫిదా అయిపోయి, కావాలనే అన్నం మిగుల్చుకుని మరీ చేసుకుంటారు. అంత కమ్మగా ఉండే ఈ రెసిపీని కేవలం 10 నిమిషాల్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి!

మిగిలిపోయిన అన్నాన్ని, టేస్టీగా, కలర్ ఫుల్ గా మార్చేస్తే, చద్ది అన్నం తింటున్నాం అనే విషయం మర్చిపోతాం. అయితే మిగిలిపోయిన అన్నాన్ని,టామాటో పలావ్ చేసేయండి.

కావాల్సిన పదార్ధాలు
నెయ్యి- 2 టేబుల్ స్పూన్స్
నూనె - 2 టేబుల్ స్పూన్స్
సాజీరా - 1/2టీ స్పూన్స్
లవంగాలు - 2
యాలకులు - 2
దాల్చిన చెక్క - 1/4ఇంచ్
ఉల్లిపాయలు - 1/4కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
టమాటో పేస్ట్ - 1/4కప్పు
టమాటో ముక్కలు - 1/2కప్పు
అన్నం - 1కప్పు
కారం - 1 టేబుల్ స్పూన్
గరం మసాలా - 1/2టేబుల్ స్పూన్
ధనియాల పొడి – 1/2టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
కొత్తమీర - కొద్దిగా

ఒక్క స్పూన్ పొడితో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కు శాశ్వతంగా చెక్ పెట్టండి!

తయారీ విధానం
1.నెయ్యిని వేడి చేసి, అందులోకి నూనె కూడా యాడ్ చేసి, మసాలా దినుసులు, వేసుకుని, వేగనివ్వాలి.
2. వేగిన మసాలాలో, ఉల్లిపాయ తరుగు వేసి, మరికాసేపు వేపుకోవాలి.
3. వేగిన ఉల్లిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, వేగిన తర్వాత, టమాటో పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి.
4.ఇప్పుడు అందులోకి, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి, నూనె పైకి తేలే వరకు వేపుకోవాలి.

5. తర్వాత టమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
6.టమాటాలు మగ్గిన తర్వాత ఉడికించిన అన్నం వేసి, హై ఫ్లేమ్ పై టాస్ చేసుకోవాలి.
7. అన్నానికి మసాలాలు బాగా పట్టించిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి, మరోసారి టాస్ చేసుకుని, స్టవ్ ఆఫ్ చేయాలి.

కేవలం 2 నిమిషాల్లో పసుపు పళ్ళు ముత్యాల్లా మెరవాలంటే ఇలా చేసి చూడండి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi