Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

నల్లటి చర్మాన్ని కాంతివంతంగా మార్చే మ్యాజిక్ ప్యాక్.. శనగపిండితో ఇలా చేసి చూడండి!

CHAI PaKODi 3 weeks ago

Besan Face Glow Tips In telugu : ప్రతి ఒక్కరికీ ముఖం కాంతివంతంగా, అందంగా ఉండాలని ఉంటుంది. కానీ ఎండ, దుమ్ము, కాలుష్యం వల్ల ముఖం నల్లగా, నిర్జీవంగా మారుతుంటుంది.

అందం కోసం ఖరీదైన క్రీమ్స్ వాడి విసిగిపోయారా?

అయితే మన వంటగదిలో ఎప్పుడూ ఉండే ‘శనగపిండి’ (Besan) తో మీ చర్మ సమస్యలకు సులువుగా చెక్ పెట్టవచ్చు. శనగపిండి నాచురల్ క్లెన్సర్‌గా పనిచేసి, ముఖంపై పేరుకుపోయిన మురికిని, మృతకణాలను (Dead cells) తొలగిస్తుంది. మరి శనగపిండితో ముఖాన్ని నిగనిగలాడేలా ఎలా మార్చుకోవాలి? ఈ ఫేస్ ప్యాక్‌లో ఏమేమి కలపాలి? అనే వివరాలు ఈ ఆర్టికల్‌లో వివరంగా చూద్దాం.

ఈ మధ్య కాలంలో వాతావరణంలో కాలుష్యం, ఎండలో ఎక్కువగా తిరగటం, ముఖం మిద శ్రద్ద ఎక్కువగా పెట్టకపోవటం వంటి అనేక రకాల కారణాలతో ముఖం నల్లగా నిస్తేజంగా మారుతుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

మనలో ప్రతి ఒక్కరూ అందమైన,కాంతివంతమైన ముఖం కావాలని కోరుకుంటారు. అలా కోరుకోవటం కూడా సహజమే. దీని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మన ఇంటిలో ఉంటే సహజసిద్దమైన పదార్ధాలతో ముఖాన్ని చాలా తక్కువ ఖర్చుతో మిలమిలా మెరిసేలా చేయవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార,ఒక స్పూన్ శనగపిండి,ఒక స్పూన్ రాగి పిండి వేసి దానిలో కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి వృత్తాకార మోషన్ లో మసాజ్ చేయాలి. బాగా ఆరాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే ముఖం మీద పెరుకుపోయిన దుమ్ము,ధూళి తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

నల్లటి పెదాలను గులాబీ రంగులోకి మార్చే అద్భుతమైన చిట్కా.. కొబ్బరి నూనెలో ఇది కలపండి!

అలాగే ముఖం మీద ఉన్న బ్లాక్ హెడ్స్,నల్లని మచ్చలు అన్నీ తొలగిపోతాయి. కాస్త సమయాన్ని కాస్త శ్రద్ద పెడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని మిలమిలా మెరిసేలా చేసుకోవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి.

30 ఏళ్ల నాటి మొండి షుగర్ అయినా, 400 దాటినా సరే.. ఈ ఒక్క డ్రింక్ తో 7 రోజుల్లో నార్మల్!

పంచదార చర్మంపై ఉన్న మురికిని తొలగించి సహజ మెరుపును అందిస్తుంది. శెనగపిండి చర్మాన్ని కాంతి వంతం అయ్యేలా చేస్తుంది. ఆయిల్ ముఖంపై పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. స్వేద రంధ్రాలు తెరచుకొనేలా చేస్తుంది. రాగి పిండి ముఖం కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.ఎండలకు నల్లగా మారిన చర్మాన్ని కూడా రాగి పిండి నయం చేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi