Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నట్స్ ఇలా తింటే మీ ఇమ్యూనిటీ రాకెట్‌లా దూసుకెళ్తుంది.. ఈ సీక్రెట్ మీకు తెలుసా?

నట్స్ ఇలా తింటే మీ ఇమ్యూనిటీ రాకెట్‌లా దూసుకెళ్తుంది.. ఈ సీక్రెట్ మీకు తెలుసా?

CHAI PaKODi 2 months ago

Dry fruits benefits In telugu : వాతావరణం మారినప్పుడల్లా జలుబు, దగ్గు వస్తున్నాయా? అయితే మీ ఇమ్యూనిటీ పెంచుకోవాల్సిన సమయం వచ్చేసింది. మన ఇంట్లో ఉండే నట్స్ తోనే రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుకోవచ్చు..

కాకపోతే వాటిని తినే విధానంలో ఒక చిన్న ట్రిక్ ఉంది. అదేంటో, నట్స్ ఎలా తింటే మనకు పూర్తి ప్రయోజనం దక్కుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి

డ్రై ఫ్రూట్స్ అనేవి ప్రతి రోజూ రెగ్యులర్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

డ్రై ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ చలి కాలంలో శరీరం వెచ్చగా ఉండటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయ పడతాయి. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

బాదంపప్పు విషయానికొస్తే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. cholesterol అసలు ఉండదు. శ్వాసకోశ సమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు నాలుగు బాదం పప్పులు తీసుకుంటే సరిపోతుంది.

జీడిపప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంటలకు మంచి రుచిని ఇస్తుంది. జీడిపప్పులో విటమిన్ E, బి 6, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా అలసట, నీరసం వంటివి లేకుండా చేస్తుంది.రోజుకి 4 జీడిపప్పులను తీసుకోవాలి.

జలుబు, దగ్గును ఇట్టే మాయం చేసే ఘాటైన మిరియాల పులుసు!

వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. రోజు రెండు వాల్నట్స్ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది.

పిస్తాపప్పులో cholesterol ని తగ్గించే లక్షణాలు ఉండటం వలన గుండెకు మేలు చేస్తుంది. అలాగే డయాబెటిస్ నియంత్రణలో ఉంచడానికి, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.

రోజుకి నాలుగు పిస్తా పప్పులు తింటే సరిపోతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ ని 5 గంటల పాటు నీటిలో నానబెట్టి తింటే వాటిల్లో ఉన్న పోషకాలు వంద శాతం మన శరీరానికి అందుతాయి.

Onion Parata: టైమ్ లేనప్పుడు కేవలం 10 నిమిషాల్లో ఇలా కమ్మని ఉల్లిపాయ పరోటా చేయండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi