Joint Pains Home Remedies in Telugu :కీళ్లనొప్పులు, రక్తహీనత, శారీరక బలహీనత మరియు తిమ్మిర్లతో బాధపడుతున్నారా? రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో ఈ చిన్న పదార్థం కలిపి తాగితే చాలు.
గుండెపోటు లాంటి ముప్పును కూడా తగ్గించి, సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే ఈ అద్భుతమైన చిట్కా గురించి పూర్తిగా తెలుసుకోండి.
ప్రస్తుతం మారిన పరిస్థితి కారణంగా మనలో చాలా మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. సమస్య వచ్చినప్పుడు కంగారు పడవలసిన అవసరం లేదు.
చిన్న చిన్న సమస్యలకు ఇంటి చిట్కాలు సరిపోతాయి. ఈ రోజు కీళ్లనొప్పులు,రక్తహీనత ,శారీరక బలహీనత వంటి సమస్యలను తగ్గించటానికి ఒక రెమిడీ తెలుసుకుందాం. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక 6 కిస్ మిస్ లను వేసి 5 నుంచి 6 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన పాలను గ్లాస్ లో పోసి కిస్ మిస్ తింటూ పాలను తాగాలి. ఈ విధంగా 10 రోజుల పాటు తాగితే మీకు మంచి ఫలితం కనపడుతుంది.
ఈ పాలను ఏ సమయంలోనైనా తాగవచ్చు. ఉదయం సమయంలో తాగితే రోజంతా ఉషారుగా ఉంటారు. కిస్ మిస్ ని పాలల్లో ఉడికించినప్పుడు పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాల పరిమాణం పెరుగుతుంది. దాంతో ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులువంటి వన్నీ తొలగి పోతాయి.
మీ శరీరంలో ఈ పోషకాలు తగ్గితే ఏమవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఈ పాలను తాగితే రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. ఎందుకంటే దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. గుండెకి సంబంధించిన సమస్యలు, అధిక రక్తపోటు, తక్కువ రక్తపోటు వంటి వాటిని తగ్గిస్తుంది. ఎందుకంటే కిస్ మిస్ పాలలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఈ పాలను తాగితే శారీరక బలహీనత,అలసట, నిసత్తువ అన్ని తొలగిపోతాయి.
కేవలం పావు స్పూన్ చాలు.. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం సమస్యలు ఇట్టే మాయం!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

