Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పైల్స్ తో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే!

పైల్స్ తో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే!

CHAI PaKODi 2 weeks ago

Piles Problem :మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా చాలా మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. పైల్స్ సమస్య ఉన్నప్పుడు కూర్చోలేరు..అలా అని ఎక్కువసేపు నిలబడలేరు.

పైల్స్ సమస్యకు మనం తీసుకునే ఆహారం, జీర్ణక్రియ సరిగ్గా లేక మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నప్పుడు వస్తుంది. పైల్స్ సమస్య ఉన్నప్పుడు ఎన్ని మందులు వాడినా ఒక్కోసారి ప్రయోజనం కనపడదు. .

ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. బాగా పండిన అరటి పండు లేదా మధ్యస్తంగా ఉన్న అరటి పండును తీసుకొని కట్ చేయాలి.

తర్వాత పచ్చ కర్పూరం చిన్న ముక్క తీసుకుని అరటి పండు ముక్కలో పెట్టుకోవాలి. దీనిని ఉదయాన్నే పరగడుపున బాగా నమిలి తినాలి. ఈ అరటి పండు తిన్నాక అరగంట వరకు ఏమి తినకూడదు…తాగకూడదు.

Also Read:బాత్రూం టైల్స్ నిమిషాల్లో కొత్తవాటిలా మెరవాలంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి

పచ్చి అరటి పండు ఉపయోగించకూడదు. ఈ విధంగా రోజులో ఒక్కసారి మాత్రమే చేయాలి. ఇలా తినలేని వారు పచ్చ కర్పూరం పొడి చేసుకుని అరటి పండు ముక్కలపై జల్లుకుని తినేయాలి.

Also Read:రెస్టారెంట్ రుచితో కమ్మని స్వీట్ కార్న్ సూప్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

ఇలా మూడు రోజుల పాటు తీసుకుంటే పైల్స్ సమస్య తగ్గుతుంది. ఈ చిట్కా పాటిస్తూ ఉప్పు, కారం,మసాలాలు తగ్గించాలి. పైల్స్ సమస్య ఉన్నవారు నీటిని ఎక్కువగా తాగాలి.

Also Read:చపాతీలోకి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా పనీర్ బుర్జీ చేయండి, ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi