Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పెళ్లిళ్లలో వడ్డించే క్రిస్పీ గోబీ 65.. పర్ఫెక్ట్ కొలతలతో ఇంట్లోనే ఇలా చేసుకోండి!

CHAI PaKODi 2 weeks ago

Gobi 65:పెళ్లిళ్లలో మరియు ఫంక్షన్లలో వడ్డించే కరకరలాడే గోబీ 65 అంటే అందరికీ ఇష్టమే! కానీ ఇంట్లో చేస్తే మెత్తబడిపోతుందా? అయితే ఎలాంటి కృత్రిమ రంగులు (Tasting salts/Colors) వాడకుండా, అచ్చం క్యాటరింగ్ వాళ్లు చేసే సీక్రెట్ ట్రిక్స్‌తో పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండే పర్ఫెక్ట్ ‘గోబీ 65’ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ రెసిపీలో చూసేయండి.

క్యాటరింగ్ వాళ్ళు చేసే Gobi 65 ఇలా ఇంట్లోనే చేయండి.. ప్రతి ఫంక్షన్లో కనిపించే గోబీ 65,ఇంట్లో చేయాలంటే చాలా కష్టం అనుకుంటారు.ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి. గోబీ 65 రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
నూనె - 3 టేబుల్ స్పూన్స్
వెల్లుల్లి - 2 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయ తరుగు - 3 టేబుల్ స్పూన్స్
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - 2 రెమ్మలు
ఎండుమిర్చి - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర - కొద్దిగా
పెరుగు - 1 కప్పు

తయారీ విధానం
1.స్టవ్ పై బాండీ పెట్టి, నీళ్లు వేడి చేసుకుని, మరిగేనీటిలో, కాలీఫ్లవర్ ముక్కలు వేసి, 70 శాతం ఉడికించి, పూర్తిగా చల్లార నివ్వాలి.
2. పెరుగు మిశ్రమం కోసం ఉంచిన పదార్ధాలు అన్ని, కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
3.చల్లారిన కాలీఫ్లవర్ ముక్కల్లో మైదా, కార్న్ ఫ్లోర్ , తగినన్ని నీళ్లు వేసి, టాస్ చేసి, నెమ్మదిగా, పిండిని పట్టించాలి.
4. పిండిని కోట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలను, వేడి నూనెలో వేసి, మీడియం ఫ్లేమ్ పై ఎర్రగా వేపుకోవాలి.

IRCTC మధుర, బృందావన్ టూర్: శ్రీకృష్ణుని జన్మస్థల దర్శనానికి బంపర్ ఆఫర్.. అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్యాకేజీ!

5. వేరొక ప్యాన్ లో నూనె బాగా వేడి చేసి, అందులోకి, ఎండుమిర్చి వేసి, వేపుకోవాలి.
6. తర్వాత, కరివేపాకు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసుకుని, హై ఫ్లేమ్ పై టాస్ చేసుకోవాలి.
7. వేగిన తాళింపు లోకి, పెరుగు మిశ్రమం వేసి, బాగా కలుపుతూ చిక్కపడనివ్వాలి.
8.చిక్కపడిన పెరుగు మిశ్రమంలో, వేపుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి, హై ఫ్లేమ్ పై దగ్గర పడే వరకు టాస్ చేసుకోవాలి.
9.చివరగా కొత్తిమీర చల్లుకుని,స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

Vandelay Infrared Thermometer రివ్యూ - జ్వరం ఉందో లేదో కేవలం ఒక్క సెకనులో తెలుసుకోండి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi