Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సాయంత్రం స్నాక్ కోసం పర్ఫెక్ట్ పెసర గారెలు - Crispy Moong Dal Vada

సాయంత్రం స్నాక్ కోసం పర్ఫెక్ట్ పెసర గారెలు - Crispy Moong Dal Vada

CHAI PaKODi 3 weeks ago

Pesara Garelu Recipe : ఈ రోజు మనం ఎంతో కరకరలాడే, రుచికరమైన పెసరపప్పు గారెలు (Moong Dal Vada) ఎలా చేయాలో చూద్దాం. పండుగ రోజుల్లో దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి లేదా సాయంత్రం వేళ టీతో పాటు వేడివేడిగా స్నాక్ గా తినడానికి ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి.

తక్కువ నూనె పీల్చుకుంటూ, పర్ఫెక్ట్ కొలతలతో, లోపల మెత్తగా బయట క్రిస్పీగా ఈ గారెలను ఎలా చేయాలో చూద్దాం.

గారెలు తయారు చేసుకోవాలంటే.. ఎక్కువగా మినప పప్పు, బొబ్బెర పప్పును వాడుతుంటాం. అయితే పెసరు పప్పుతోనూ గారెలు తయారు చేసుకోవచ్చు. ఎలానో ఇక్కడ తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు
పెసర పప్పు రెండు వందల గ్రాములు
పచ్చిమిర్చి పది
అల్లం రెండు అంగుళాలు
ఉప్పు తగినంత
నూనె మూడు వందల మిల్లి లీటర్లు

Also Read:15 రోజుల్లో ఒత్తైన, పొడవైన జుట్టు మీ సొంతం: ఈ ఒక్క స్పూన్ నూనెతో!

తయారి విధానం
పెసర పప్పును మూడు గంటల పాటు నానబెట్టాలి. పెసలు,పచ్చిమిర్చి,అల్లం మరియు ఉప్పు వేసి మందపాటి పేస్ట్ లా రుబ్బుకోవాలి. ముద్దని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ప్లాస్టిక్ షీట్ ఫై ఉండని పెట్టి వృత్తాకారంలోకి చేయాలి.

వృత్తం మధ్యలో కన్నం పెట్టుకోవాలి.మూకుడులో నూనె వేసి వేడి చేసి,వేడి అయ్యాక వడని వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే పెసర గారెలు రెడీ.

బ్రేక్ ఫాస్ట్ కైనా, ఈవినింగ్ స్నాక్ కైనా ఇది బెస్ట్ ఛాయిస్. చాలా తక్కువ సమయంలో పర్ఫెక్ట్ గా వచ్చే ఈ రెసిపీని మీరూ ట్రై చేయండి.

Source: chaipakodi.com

Also Read:ఒక్కసారి ఈ ప్యాక్ వేసుకుంటే చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారడం 100% గ్యారెంటీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi