Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సూపర్ నట్ "పీకాన్": చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి, ఇమ్యూనిటీని పెంచే అద్భుత ఔషధం!

సూపర్ నట్ "పీకాన్": చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి, ఇమ్యూనిటీని పెంచే అద్భుత ఔషధం!

CHAI PaKODi 3 weeks ago

Pecan Nuts benefits In telugu : డ్రై ఫ్రూట్స్ లో అత్యంత ఖరీదైన పీకన్ నట్స్ గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ నట్స్ ప్రతి రోజు తినటం వలన శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, లిపోప్రొటీన్ లేదా 'చెడ్డ' కొలెస్ట్రాల్‌ ల స్థాయిలను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుందని ఇటీవల జరిగిన పరిశోదనలో తేలింది.

ఈ రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, రోజువారీ డైట్‌లో పీకాన్ నట్స్ (Pecan Nuts) చేర్చుకోవడం వల్ల రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ (LDL) సులభంగా కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు, వీటిలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) రెట్టింపు చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఈ సూపర్ నట్ గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి!

Also Read:డయాబెటిస్, రక్తహీనతలకు చెక్ పెట్టే మ్యాజిక్ పొడి.. రోజుకు 1 స్పూన్ తింటే చాలు!

ప్రస్తుతం మనలో చాలా మంది ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించుకోవటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారికి ఈ డ్రై ఫ్రూట్ చాలా లాభం చేకూరుస్తుంది. ఈ నట్స్‌ లో ..పాలీ అన్‌ సాట్చూరేటెడ్‌ ఫ్యాట్‌తో పాటు బీటాసైటోస్టిరాల్‌ ఫ్యాట్‌ కాంబీనేషన్‌ ఉండటం వల్ల బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ను బాగా తగ్గిస్తుందని పరిశోదకులు అంటున్నారు.

యాంటి ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోదక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది. ఎముకలు,కండరాలు బలంగా ఆరోగ్యంగా ఉండి కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు లేకుండా చేస్తుంది.

ఈ నట్స్‌లో ఎల్‌ ఆర్జిన్‌ అనే.. అమైనో ఆర్జిన్‌ ఉండటం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు రాలకుండా పెరుగుతుంది.

మెదడు పనితీరు బాగుంటుంది. అందువల్ల ఎదిగే పిల్లలకు కూడా మంచిది. వీటిని డైరెక్ట్ గా తింటే కాస్త వెగటుగా ఉంటాయి. అందువల్ల నాలుగు గంటలు నానబెట్టి తినవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ కాస్త ఖరీదు ఎక్కువైన దానికి తగ్గట్టుగా మన శరీరానికి ప్రయోజనాలను అందిస్తుంది. రోజుకి 3 pecan Nuts తినవచ్చు. స్ప్రౌట్స్‌తో, ఫ్రూట్స్‌తో కలిపి కూడా తినవచ్చు.

Also Read:ఈ ఒక్క ఆకు పొట్టపై రాస్తే.. 7 రోజుల్లో బానపొట్ట మాయం!

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi