Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

టమోటా, కీరదోస కలిపి తింటున్నారా? అయితే మీ శరీరంలో జరిగేది ఇదే!

CHAI PaKODi 3 weeks ago

Tomato cucumber juice : సలాడ్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి టమోటా మరియు కీరదోస. బరువు తగ్గాలనుకునే వారు, ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఎక్కువగా ఈ రెండింటినీ కలిపి తినడానికి ఇష్టపడతారు.

కానీ, టమోటా, కీరదోస కలిపి తీసుకుంటే శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఈ కాంబినేషన్ ఆరోగ్యానికి మంచిదేనా? లేక గ్యాస్, అజీర్తి లాంటి సమస్యలు తెస్తుందా? ఈ ఆసక్తికరమైన విషయాలను ఈ ఆర్టికల్‌లో చదివి తెలుసుకోండి.

కీరదోస,టమోటాలలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్య అనేది చాలా మందిని వేదిస్తుంది. ఈ సమస్య నుండి బయట పడటానికి టమోటా,కీరదోస రెండు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. దీని కోసం ఒక జ్యూస్ తయారు చేసుకోవాలి.

ఒక మిక్సీ జార్ లో ఒక టమోటా ముక్కలు, కీరదోసలో సగాన్ని ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 10 పుదీనా ఆకులు,రెండు మిరియాలు, ఒక కప్పు నీటిని పోసి మిక్సీ చేసి గ్లాసులో పోసి అరచెక్క నిమ్మరసం కలిపి తాగాలి. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

చాలా మందికి తెలియని పాతకాలం నాటి రెసిపీ 'చమ్మకాయ పచ్చడి'.. దీన్ని తింటే ఎన్నో రోగాలు పరార్!

అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. టమోటా,కీరదోస రెండింటిలో ఉన్న పోషకాలు బరువు తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ డ్రింక్ ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగవచ్చు.

IRCTC మధుర, బృందావన్ టూర్: శ్రీకృష్ణుని జన్మస్థల దర్శనానికి బంపర్ ఆఫర్.. అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్యాకేజీ!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi