Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

తెల్ల జుట్టు సమస్య ఉందా? ఎండిన ఉసిరితో ఇలా ఈజీగా నల్లగా మార్చుకోండి.

CHAI PaKODi 1 hr ago

Dry Amla For White Hair : తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చే అద్భుతమైన ఔషధం ఎండిన ఉసిరి. ఇంట్లోనే ఉసిరితో న్యాచురల్ హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలి?

ఈ సులభమైన చిట్కాను ఇప్పుడే తెలుసుకోండి.

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు ఎండిన ఉసిరి.. ప్రాసెస్ చాలా ఈజీ..ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వచ్చేస్తుంది. దాంతో చాలా కంగారూ పడిపోయి మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. దీని వలన జుట్టు రాలటం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తే మంచి ఫలితం వస్తుంది.

ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా ప్రయత్నం చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కా కోసం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. కరివేపాకు, ఉసిరి ముక్కలు, కొబ్బరి నూనె ఉపయోగిస్తున్నాం. ఉసిరి ముక్కలు సీజన్ లో అయితే తాజా ముక్కలను ఉపయోగించవచ్చు.

జొన్న రొట్టెలు చేయడం రాదా? అయితే ఈ 'మసాలా జొన్న రొట్టె' ట్రై చేయండి, చాలా ఈజీ!

చపాతీలు మిగిలాయా? అయితే 5 నిమిషాల్లో ఇలా టేస్టీ నూడుల్స్ చేసుకోండి!

ఉసిరి ముక్కలు ఎండినవి ఆయుర్వేదం షాప్ లో లభ్యం అవుతాయి. ఒక గిన్నెలో కొబ్బరినూనె తీసుకొని దానిలో కరివేపాకు, ఎండిన ఉసిరి ముక్కలు వేసి బాగా మరిగించాలి. మరిగిన ఈ నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను జుట్టుకి రాసి సున్నితంగా రెండు నిమిషాలు మసాజ్ చేయాలి.

ఈ నూనెను మామూలు నూనె వాడినట్టుగా వాడవచ్చు. లేదా జుట్టుకి రాశాక అరగంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం పడుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi