Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఊపిరితిత్తుల్లో కఫం, శ్లేష్మం కరిగిపోవాలంటే ఈ ఒక్క పనిచేస్తే చాలు!

CHAI PaKODi 3 days ago

Lungs clean in Telugu : ప్రస్తుత కాలంలో వాయు కాలుష్యం, ధూమపానం మరియు ఇతర అనారోగ్య కారణాల వల్ల ఊపిరితిత్తులలో (Lungs) కఫం మరియు శ్లేష్మం పేరుకుపోవడం చాలా సాధారణం అయిపోయింది.

దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు మరియు ఆయాసం వంటి సమస్యలు ఎదురవుతాయి.

మీ ఊపిరితిత్తులను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ పద్ధతిలో శుభ్రం చేసుకోవడం ఎలా? ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని సులభంగా కరిగించి, శ్వాసకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏ వంటింటి చిట్కాలు పాటించాలి? అనే పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. లంగ్స్ హెల్త్ కాపాడుకోవడానికి ఇప్పుడే ఈ చిట్కాలను ట్రై చేయండి!

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరోనా అనేది ఊపిరితిత్తులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా దృఢంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ద తప్పనిసరిగా పెట్టాలి.

గాలిలో ఉండే విషపదార్థాలు., కాలుష్య కారకాలు, పొగ తాగే అలవాటు, కొన్ని అనారోగ్య ఆహారపు అలవాట్ల కారణంగా ఊపిరితిత్తులు బలహీనంగా మారతాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా బలంగా, ఉండాలంటే ఇలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు. ఊపిరితిత్తులు క్లీన్ గా ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిది.

మటన్, చికెన్ బిర్యానీలు కూడా దీని ముందు దిగదుడుపే: స్పెషల్ ఆకాకరకాయ దమ్ బిర్యానీ!

చేదు లేని కాకరకాయ ఒరుగులు: ఒక్కసారి చేస్తే సంవత్సరం అంతా కరకరలాడుతూనే ఉంటాయి!

ఆరెంజ్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి ఊపిరితిత్తుల ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల శ్వాస సమస్యల చికిత్సకు అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

అలాగే ఆపిల్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్, విటమిన్ బి, సి, ఇ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయపడతాయి. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఊపిరితిత్తుల్లో కఫము,శ్లేష్మం లేకుండా శుభ్రం అవుతాయి. ఉదయాన్నే కొన్ని పుదీనా ఆకులను తిన్నా ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి. వ్యాయామం, ప్రాణాయామం చేయటం వలన లంగ్స్ కెపాసిటీ బాగా పెరిగి శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi