Dailyhunt
ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్‌లో హైదరాబాద్‌ క్వాడ్రిక్ ఐటీకి రెండో ప్లేస్‌

ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్‌లో హైదరాబాద్‌ క్వాడ్రిక్ ఐటీకి రెండో ప్లేస్‌

Chanukya 10 months ago

ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన AI for Andhra Police Hackathon 2025 - (Empowering law enforcement through AI Agents)లో తెలంగాణకు చెందిన టెక్నాలజీ సంస్థ Quadric IT సంస్థ రెండో స్థానంలో నిల్చింది. కృత్రిమ మేథను ఉపయోగించి ప్రజాపాలన, సంరక్షణే లక్ష్యంగా ఆ సంస్థ బ్లూ క్వయిరీ అనే ప్రాజెక్టును ప్రదర్శించింది. దేశం నలుమూలల నుంచి 57 సంస్థలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రజా భద్రతా, పోలీసింగ్ సవాళ్లను ఎదుర్కొవటం, విపత్కర పరిస్థితుల్లో కృత్రిమ మేధ ఉపయోగం లాంటి అంశాలపై సంస్థలు తమ ప్రాజెక్టుల్ని రూపొందించాయి.

 ఇంగ్లీష్, మరియు తెలుగు భాషల్ని ఉపయోగించిన ఈ ప్రాజెక్టు, కేసుల విచారణకు ఉపయోగడేలా క్వాడ్రిక్  సంస్థ రూపొందించింది.

సుజయ్ అనిశెట్టి, సాయి అజిత్ భరద్వాజ్ ఈ ప్రాజెక్ట్‌లో కీలక భూమిక పూషించారు. ఈ ప్రాజెక్టుకు రఘురామ్ తాటవర్తి, కేసరి సాయి కృష్ణ, సబ్నీ వీసు, కమల్ చంద్ కొత్త, ప్రియతమ్ తాటవర్తి పర్యవేక్షించారు. 

గట్టి పోటీ మధ్య క్వాడ్రిక్ రెండో విజేతగా నిల్చిందని ఆ సంస్థకు నేతృత్వం వహిస్తున్న రఘురామ్ తాటవర్తి చెప్పారు. బ్లూ క్వయిరీని పూర్తిస్థాయి ప్రాజెక్టుగా వృద్ధి చేసేందుకు సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం చెప్పినట్టు ఆయన వివరించారు. క్వాడ్రిక్ ఐటీ సంస్థను ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత అభినందించి, ఈ విభాగంలో మరింత కృషి చేయాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chanukya