ఇండస్ట్రీలో ఇటీవల రియాల్టీ స్టోరీలతో వస్తున్న సినిమాలు మంచి ఆదరణను సంపాదించుకుంటున్నాయి. ఇదే కోవలో వస్తున్న మరో మూవీ దూరదర్శిని (Dooradarshini Movie).
సువిక్షిత్, గీతికా రతన్ జంటగా నటించిన ఈ సినిమా మే 15న థియేటర్లలోకి వస్తోంది. ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీకి 'కలిపింది ఇద్దరిని' అనేది ట్యాగ్‌లైన్ గా పెట్టారు.
కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ బ్యానర్‌పై జయ శంకర్ రెడ్డి, పాటిమీది సంతోష్ నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హీరో ప్రియదర్శి, దర్శకుడు సాయి కంపాటి ముఖ్య అతిథులుగా వచ్చారు. 90వ దశకం నాటి వాళ్లందరికీ దూరదర్శని టైటిల్ వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉందని సాయి కంపాటి అభిప్రాయపడ్డాడు. దూరదర్శిని ట్రైలర్ చూడగానే చిన్నప్పటి జ్ఞాపకాలు వచ్చాయని ప్రయదర్శి అన్నాడు.

దూరదర్శిని అన్ని వర్గాలను అలరిస్తుందని దర్శకుడు కార్తికేయ కొమ్మి అన్నారు. హీరోయిన్ల నటన, కథలోని ఎమోషన్ హైలైట్ అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది అన్ని ఊళ్ల కథ అని, టికెట్ డబ్బులకు పూర్తి న్యాయం చేస్తుందని హీరో సువిక్షిత్ హామీ ఇచ్చాడు.

