Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ అమ్మాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణుప్రియ..

ఆ అమ్మాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణుప్రియ..

Chitrajyothy 3 days ago

బుల్లితెర నటి, హాట్ యాంకర్ విష్ణుప్రియ (Vishnupriya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిరోజులుగా విష్ణు పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతోన్న విషయం తెల్సిందే.

విష్ణుప్రియ తన సబ్‌స్క్రిప్షన్ అకౌంట్ ద్వారా యువతను తప్పుదోవ పట్టించేలా, అసభ్యకరంగా ఉండే కంటెంట్‌ను షేర్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తోందంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో విజయవాడకు చెందిన ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆమెపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్బాయిల బలహీనతలను ఆమె క్యాష్ చేసుకుంటుందని తెలిపారు.

ఇలాంటివేమీ పట్టించుకోని విష్ణుప్రియ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతోంది. అయితే తాజాగా ఆమె మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. తన గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి ఒక లేడీ యూట్యూబర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. అలసి విషయం ఏంటంటే.. ప్లే లైక్ ఇంకాగ్నిటో అనే పేరుతో సోనాలి అనే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. సినిమా, రాజకీయం అనే తేడా లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కంటెంట్ ని తీసుకొని.. తన అభిప్రాయాన్ని చెప్తూ ఉంటుంది. కొన్నిసార్లు చాలా గట్టిగా వారిని రోస్ట్ చేస్తూ ఉంటుంది.

తాజాగా సోనాలి.. విష్ణుప్రియ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా డబ్బులు ఎలా సంపాదిస్తోంది.. కుర్రాళ్ళ బలహీనతను ఎలా వాడుకుంటుంది.. నెలకు ఆమె ఎంత సంపాదిస్తోంది లాంటి విషయాలను చెప్తూ ఒక వీడియో చేసింది. అది యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఇక ఆ వీడియో గురించే విష్ణు .. పోలీసులను ఆశ్రయించింది. ఆమె తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని, ఒక అమ్మాయి అయ్యి ఉండి.. సెలబ్రిటీ అమ్మాయిల మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోందని ఫైర్ అయ్యింది. అందుకే కచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అనుకున్నాను అని చెప్పింది. మిగతావారికి కూడా ఇదొక హెచ్చరిక అని, ఎవరైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే వారి ఛానెల్ మీద స్ట్రైక్ పడేలా చేస్తానని చెప్పింది. మరి ఈ ఫిర్యాదుపై సోనాలి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy