Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ ఇడ్లీ నటి వలనే నా కాపురం కూలిపోయింది

ఆ ఇడ్లీ నటి వలనే నా కాపురం కూలిపోయింది

Chitrajyothy 1 week ago

కోలీవుడ్ లో ప్రస్తుతం రవి మోహన్ (Ravi Mohan) ప్రెస్ మీట్ సంచలనం సృష్టిస్తోంది. రెండేళ్ళుగా తన భార్య నరకం చూపిస్తోందని మీడియా ముందుకు వచ్చి ఆయన కంటతడి పెట్టడం మరింత సంచలనంగా మారింది.

తన భార్య ఆర్తి తనను వేధిస్తోందని, సోషల్ మీడియాలో జరుగుతున్నా సైబర్ బుల్లియింగ్ చాలా దారుణమైన విషయమని, దీనివలన మనుషులు ప్రశాంతతను కోల్పోయి చావు వరకు వెళ్తారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ సైబర్ బుల్లియింగ్ వలన తన ప్రాణ స్నేహితురాలు కెనీషా దూరమైందని ఆయన బాధపడ్డాడు.

' నా పిల్లల కోసం ఈ 16 ఏళ్ళు నోరు విప్పలేదు. అది నా చేతకానితనం అని అనుకుంటున్నారు. నా కుటుంబం కోసమే నేను ఇన్నేళ్ళు కష్టపడ్డాను. నా పిల్లల చదువులకు నేనే ఫీజు కడుతున్నాను. నేను ఒక స్టార్ హీరోని.. నేను నటించిన సినిమాలు అన్ని హిట్. ఎంతమంది అందమైన అమ్మాయిలతో నటించాను. అలాంటివారితోనే రిలేషన్ పెట్టుకొని నేను.. వేరొకరితో సంబంధం పెట్టుకుంటానా.. ? ముందే మా అమ్మానాన్న చెప్పారు. నేనే వినలేదు.

ఒక మూడు అక్షరాలా ఇడ్లీ నటి నా కుటుంబాన్ని నాశనం చేసింది. నా గురించి మాట్లాడే హక్కు ఆమెకు లేదు. ఆ నటి ముగ్గురు నటుల జీవితాలను నాశనం చేయడానికే వచ్చిందని వాళ్లే నాకు చెప్పారు. ముగ్గురి జీవితాలను నాశనం చేయాలనుకున్న ఆ బొమ్మ నా జీవితం గురించి మాట్లాడుతోంది' అని చెప్పాడు. దీంతో ఆ ఇడ్లీ నటి ఎవరు అని కోలీవుడ్ లో ఆరాలు మొదలయ్యాయి. చాలామంది ఆమె ఖుష్బూ సుందర్ అని చెప్పుకొస్తున్నారు. రవి - ఆర్తి విడాకుల విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన సమయంలో ఖుష్బూ.. ఆర్తికి సపోర్ట్ గా నిలిచింది. ఫెమినిస్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. ఇక రవి మోహన్ ప్రెస్ మీట్ తరువాత ఖుష్బూ ఒక పోస్ట్ పెట్టింది. 'కొందరు తమ DNAను నిరూపించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. నేను చెప్పింది నిజమేనని నిరూపించినందుకు ధన్యవాదాలు' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆ ఇడ్లీ నటి ఖుష్బూనే అని కన్ఫర్మ్ అయ్యినట్టే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy