Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ క్రికెటర్ తో శ్రీలీల డేటింగ్.. నిజమేనా

ఆ క్రికెటర్ తో శ్రీలీల డేటింగ్.. నిజమేనా

Chitrajyothy 1 week ago

ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సర్వ సాధారణం. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ ప్రేమలు, డేటింగ్ రూమర్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోన్న శ్రీలీల (Sreeleela) డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఈ ముద్దుగుమ్మ ఒక స్టార్ క్రికెటర్ తో ప్రేమలో పడిందని వార్తలు గుప్పుమంటున్నాయి. మొన్నటివరకు శ్రీలీల.. బాలీవుడ్ కుర్ర హీరో కార్తీక్ ఆర్యన్ ప్రేమలో తడిసిముద్దవుతోందని, వీరిద్దరూ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేశాయి.

ఇక ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ ప్లేస్ లో క్రికెటర్ తిలక్ వర్మ వచ్చాడు. శ్రీలీల, తిలక్ వర్మ ఏడాదిగా ప్రేమలో ఉన్నారని టాక్ నడుస్తోంది. ఇలా అనుకోవడానికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. గత ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమల వెళ్లగా, అదే సమయంలో తిలక్ వర్మ కూడా కుటుంబంతో అక్కడ కనిపించాడు. అలాగే ఇటీవల IPL మ్యాచ్ సమయంలో శ్రీలీల తల్లి ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ఫ్యామిలీతో కనిపించింది. అంతేకాకుండా ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌కి శ్రీలీల హాజరైంది. ఆమె టీమ్‌లోని ఒక వ్యక్తి తిలక్ వర్మ జెర్సీ ధరించడం ఈ వార్తలను కన్ఫర్మ్ చేసింది.

తిలక్ వర్మ ఫ్రెండ్స్ సైతం అతను లవ్ లో ఉన్నాడని చెప్పడంతో నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే శ్రీలీల నోరు విప్పాల్సిందే. ఇక ఆమె కెరీర్ గురించి చెప్పాలంటే ఒక మంచి హిట్ కోసం ఎన్నో కష్టాలుపడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో అమ్మడు ఒక సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy