Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆదర్శ కుటుంబం.. ఆ హీరోయిన్ కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన గురూజీ

ఆదర్శ కుటుంబం.. ఆ హీరోయిన్ కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన గురూజీ

Chitrajyothy 2 days ago

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) సినిమాల్లో మొదటి హీరోయిన్ కన్నా సెకండ్ హీరోయిన్ కే ఫ్యాన్స్ ఎక్కువమంది ఉంటారు అంటే అతిశయోక్తి కాదు.

మొదటి నుంచి గురూజీ ఎక్కువ సెకండ్ హీరోయిన్ మీదనే ఫోకస్ చేస్తాడు. అలానే అరవింద సమేతలో పూజా కన్నా ఈషా రెబ్బకే ఎక్కువ హైప్ వచ్చింది. అలానే అల వైకుంఠపురంలో కూడా సెకండ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ చాలా హాట్ గా కనిపించింది. అంతేందుకు గుంటూరు కారంలో శ్రీలీల కంటే మీనాక్షీ చౌదరికే ఎక్కువ పేరు వచ్చింది. గురూజీ సినిమా అంటే సెకండ్ హీరోయిన్ కంపల్సరీ.

ప్రస్తుతం త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆదర్శ కుటుంబం. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక ఈ చిత్రం హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తోందని సమాచారం. అయితే ఆమె మొదటి హీరోయిన్ అయితే సెకండ్ హీరోయిన్ ఎవరు అని అభిమానులు ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు ఆ సెకండ్ హీరోయిన్ ఎవరు అనేది ఎట్టకేలకు తెలిసిపోయింది. అందుతున్న సమాచారం ప్రకారం గురూజీ.. మరోసారి నివేతాకే ఆ సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అల.. వైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నివేతా కనిపించింది. అందులో చేసింది చిన్న పాత్రనే అయినా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఈ చిన్నది గురూజీ దర్శకత్వంలో నటించబోతోంది. మరి ఈసారి కూడా చిన్న పాత్రనేనా.. లేక గురూజీ కథను మార్చే కీలక పాత్ర ఏమైనా ఇచ్చాడా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే మేకర్స్ నివేతాని అధికారికంగా సినిమాలోకి ఆహ్వానించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy