Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆలియా నెపోకిడ్.. శార్వరి అవుట్‌ సైడర్‌.. మళ్లీ మొదటికి బాలీవుడ్!

ఆలియా నెపోకిడ్.. శార్వరి అవుట్‌ సైడర్‌.. మళ్లీ మొదటికి బాలీవుడ్!

Chitrajyothy 15 hrs ago

ఇండస్ట్రీలోనైనా నెపోటిజం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ టాపిక్ కాస్త ఎక్కువగానే హల్చల్ చేస్తుంటుంది. సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ (Sushant Singh Rajput) మృతి తర్వాత ఇదే విషయంపై బాలీవుడ్ అట్టుడికింది.

ఆ దెబ్బతో కొందరు అగ్ర నిర్మాతలు కూడా బాలీవుడ్‌లో దుకాణం సర్దేశారు. బాలీవుడ్ సక్సెస్ రేట్ పడిపోవడానికి ఓ కారణంగా కూడా ఈ సమస్య నిలుస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అలాంటి బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే కాస్త ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడుతుందని అనుకుంటే.. ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చేసింది. ఆలియా (Alia Bhatt), శార్వరి రూపంలో ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌లో నెపోటిజం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

వీరిద్దరూ కలిసి 'ఆల్ఫా' (Alpha) అనే చిత్రంలో నటిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరూ 'ఇండియాస్ గాట్ టాలెంట్ సీజన్ 2'లో పాల్గొన్నారు. ఈ షోలో వీరిద్దరి బిహేవియర్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వీరిద్దరిలో శార్వరి టాలెంట్ ఉన్న అమ్మాయి అంటూ నెటిజన్లు చేసే ట్వీట్స్‌కు ఆలియా ఫ్యాన్స్ కూడా అస్సలు తగ్గడం లేదు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ కుమార్తె కాబట్టే.. ఆలియా ఇంకా ఇండస్ట్రీలో ఉందని, లేదంటే ఎప్పుడో దుకాణం సర్దేసేది అంటూ.. నెపోటిజాన్ని హైలెట్ చేస్తున్నారు. అంతేకాదు, ఆమె విమర్శలను తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా ఫీలయ్యారని నెటిజన్లు పేర్కొంటున్నారు.

మరోవైపు శార్వరీ వాఘ్ (Sharvari Wagh) మాత్రం 'అవుట్ సైడర్' అయినప్పటికీ, విమర్శలను పాజిటివ్‌గా తీసుకుని చక్కగా సమాధానమిచ్చిందని అంటున్నారు. ఈ విషయంలో శార్వరీకి మంచి మార్కులు పడుతున్నాయి. త్వరలోనే ఆమె స్టార్ హీరోయిన్‌గా మారుతుందని, అందుకోసం ఆమె చాలా కష్టపడుతుందనే కామెంట్స్‌ను ఆలియా ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. శార్వరీకి సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు, బ్యాక్‌గ్రౌండ్ లేకపోవచ్చు కానీ, ఆమె పొలిటికల్‌గా తోపు ఫ్యామిలీకి చెందిన యువతి అని వాదిస్తున్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి మనవరాలైన శార్వరీకి అవకాశాలు రావడంలో అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదంటూ.. వారి వాదనను వినిపిస్తున్నారు. ఇలా మొత్తంగా అయితే పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఎంత నెపోకిడ్ అయినా, ఎంతగా సపోర్ట్ లేకపోయినా.. టాలెంట్ ఉంటే చాలని వీరి వాదనలను చూస్తున్నవారంతా రియాక్ట్ అవుతుండటం విశేషం.

ఇవి కూడా చదవండి:

నారా లోకేష్‌తో తనని పోల్చగానే.. రామ్ చరణ్ ఏమన్నారంటే

నెట్‌ఫ్లిక్స్ ఊపిరి పీల్చుకో.. బాహుబలి టార్చ్‌బేరర్ వస్తున్నాడు!

పండంటి బిడ్డకు జననం.. నారా రోహిత్, శిరీష దంపతులకు ప్రమోషన్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy