Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమ్మ బాబోయ్.. రామ్ చరణ్ బాడీగార్డ్ కి ఇంత స్టోరీ ఉందా

అమ్మ బాబోయ్.. రామ్ చరణ్ బాడీగార్డ్ కి ఇంత స్టోరీ ఉందా

Chitrajyothy 3 days ago

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటించిన మోస్ట్ అవేటెడ్ ప్యాన్-ఇండియా మూవీ పెద్ది (Peddi) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

అయితే, ఈ ఈవెంట్‌లో రామ్‌చరణ్ క్రేజ్, సినిమా ట్రైలర్ హడావుడి ఒక ఎత్తైతే... చరణ్ పక్కన 'షాడో'లా నిలిచిన ఒక ప్రత్యేక వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆయనే అంతర్జాతీయ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ కెవిన్ కుంట (Kevin Kunta). ముంబై ఎయిర్‌పోర్ట్ నుండి ఈవెంట్ ముగిసే వరకు రామ్‌చరణ్‌కు స్పెషల్ బాడీగార్డ్‌గా వ్యవహరించిన కెవిన్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో 'పెద్ది' సినిమా ప్రమోషన్స్ కన్నా ఎక్కువగా వైరల్‌గా మారాయి.

అసలు ఎవరు ఈ కెవిన్ కుంట..? సెలబ్రిటీల పక్కన బాడీగార్డ్స్ ఉండటం సహజమే కానీ, కెవిన్ కుంట కేవలం ఒక సాధారణ సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాదు. ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్, ప్రస్తుతం ఇటలీలో నివసిస్తూ అక్కడ ప్రొఫెషనల్‌ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైటర్‌గా రికార్డులు సృష్టించాడు. ఇటలీలో నేషనల్ మిడిల్‌వెయిట్ MMA ఛాంపియన్‌ గా నిలిచిన కెవిన్, ఎన్నో అంతర్జాతీయ రింగ్ ఫైట్స్‌లో పవర్‌ఫుల్ టైటిల్స్ గెలుచుకున్నాడు. కేవలం రింగ్ లోపలే కాకుండా, రియల్ లైఫ్‌లో సెలబ్రిటీలు, అంతర్జాతీయ విఐపిలకు అత్యున్నత స్థాయి క్లోజ్ ప్రొటెక్షన్ VVIP సెక్యూరిటీ అందించే ప్రొఫెషనల్ బాడీగార్డ్‌గా కూడా ఇతనికి భారీ డిమాండ్ ఉంది.

రామ్‌చరణ్ ముంబైలో అడుగుపెట్టిన క్షణం నుండి మీడియా కెమెరాలన్నీ చరణ్‌తో పాటు కెవిన్ వైపు కూడా తిరిగాయి. కెవిన్ కుంట భారీ శారీరక దారుఢ్యం, సిక్స్‌ప్యాక్ బాడీ, ఎత్తైన కటౌట్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రామ్‌చరణ్ పక్కన ఇతను నడుచుకుంటూ వస్తుంటే ఏదో హాలీవుడ్ యాక్షన్ సినిమా సెట్ లోని దృశ్యంలా కనిపించింది. ముంబైలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ను చూడటానికి వేలాది మంది అభిమానులు, మీడియా ప్రతినిధులు ఒకేసారి ఎగబడ్డారు. ఆ సమయంలో కెవిన్ తన పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌తో గుంపును నియంత్రించిన విధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఇతనికి "ది బీస్ట్" అంటూ ట్యాగ్‌లు ఇచ్చి ఇన్ స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లతో తెగ షేర్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy