Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Anantha Sriram: ఆ పాట రాయడానికి యాభై రోజులు పట్టింది

Anantha Sriram: ఆ పాట రాయడానికి యాభై రోజులు పట్టింది

Chitrajyothy 2 days ago

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ 'పెద్ది' (Peddi). జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రత్యేక గీతాన్ని రామ్ చరణ్, శ్రుతి హాసన్, జాన్వీ కపూర్ పై చిత్రీకరించారు.

ఈ పాటను ఈ రోజు భోపాల్ లో జరిగే ఈవెంట్ లో విడుదల చేయనున్నారు. అనంత్ శ్రీరామ్ రచించిన ఈ గీతాన్ని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన బృందం ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు.

ఈ సందర్భంగా అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ 'ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించగా తెలుగులో 30 పాటలు రాశాను. ప్రతి పాట కొత్తగానే ఉంటుంది. ప్రయోగాలకు ఎప్పుడూ పెద్ద పీట వేసే రెహమాన్ 'పెద్ది' చిత్రంలో కూడా ఓ కొత్త తరహా ప్రయత్నం చేశారు. ఐటెం సాంగ్ రాయడానికి ఇలాంటి బాణీలు కూడా ఇవ్వొచ్చా అని మేమంతా ఆశ్చర్యపోయాం. ఈ ప్రత్యేక గీతం రాయడానికి నాకు 50 రోజులు పట్టిందంటే నమ్మండి' అని తెలిపారు. 'బావా... చీర.. చొక్కా చిక్కడిపోవాలోయ్' అంటూ ఈ ప్రత్యేక గీతం సాగుతుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 4న సినిమా విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy