Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అందాల ఆరబోత.. జాన్వీ కెరీర్ కి మైనస్ కానుందా

అందాల ఆరబోత.. జాన్వీ కెరీర్ కి మైనస్ కానుందా

Chitrajyothy 6 days ago

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. దేవర సినిమాలో జాన్వీ ఓ రేంజ్ క్యారెక్టర్ లో కనిపిస్తుందేమో అనుకున్నారు.

కానీ, అందాల ఆరబోతకు, సాంగ్స్ కు తప్ప అమ్మడి క్యారెక్టర్ చెప్పుకోదగినట్లు ఏమి లేదు. దేవర 2 లో అయినా తంగం పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది అనుకుంటే.. ఆ సీక్వెల్ ఇంకా పట్టాలే ఎక్కలేదు.

దేవర తరువాత జాన్వీ ఆచితూచి అడుగులువేస్తోంది.. అందుకే పెద్ది లాంటి స్పోర్ట్స్ డ్రామాను ఎంచుకుంది అని అనుకున్నారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అచ్చియమ్మగా జాన్వీ కనిపించనుంది. ఇందులో అయినా ఈ చిన్నదాని పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది అనుకుంటే అది పొరపాటేనేమో అనిపిస్తుంది. చికిరి చికిరి సాంగ్ లో అమ్మడి అందాల ఆరబోత చూశాక ఇందులో కూడా ఆమె దానికే పరిమితం అని విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా ట్రైలర్ లో కూడా జాన్వీ అందాల ఆరబోత చూశాక నెటిజన్స్ కన్ఫర్మ్ చేశారు. అమ్మడి అందాల ఆరబోత, డైలాగ్స్ మరీ బోల్డ్ గా ఉన్నాయి.

అవును.. ట్రైలర్ రిలీజ్ తరువాత అందరి నుంచి ఒకటే మాట వినిపిస్తోంది. పెద్దికి జాన్వీ మైనస్ అవుతుందా..? అని. సాధారణంగా కమర్షియల్ సినిమాలకు హీరోయిన్ గ్లామర్ ప్లస్ అవుతుంది. కానీ,పెద్ది లాంటి కథలకు గ్లామర్ మైనస్ అవుతుంది అని చెప్పుకొస్తున్నారు. ఎంతో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన పెద్ది కథకు జాన్వీ అందాల ఆరబోత ఎబెట్టుగా ఉంటుందని, ఆమె పాత్ర వచ్చినప్పుడల్లా కథ ఫ్లో మారిపోతుందేమో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే పెద్దికి అచ్చియమ్మనే పెద్ద మైనస్ అవుతుంది. మరి బుచ్చి.. అచ్చియమ్మ పాత్రను ఎలా డిజైన్ చేశాడు అనేది చూడాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy