Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'అండర్‌ రేటెడ్‌' నటిగా చూస్తున్నారా? పాయల్ రాజ్‌ఫుత్‌ సమాధానమిదే!

'అండర్‌ రేటెడ్‌' నటిగా చూస్తున్నారా? పాయల్ రాజ్‌ఫుత్‌ సమాధానమిదే!

Chitrajyothy 3 months ago

ళ్లలో మెరుపు.. పెదవులపై చిరునవ్వు.. వెండితెరపై బోల్డ్‌ నటన.. ఇదీ మనం చూసే పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput). కానీ ఆ గ్లామర్‌ వెనుక ఒక సామాన్య అమ్మాయి పడిన ఆవేదన ఉంది.

అవకాశాల కోసం ఎదురుచూపులు.. ఆత్మీయుల దూరం.. ఒంటరి పోరాటం.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాయల్‌ కన్నీరు పెట్టుకున్న తీరు ఆమెలోని సున్నితమైన కోణాన్ని ఆవిష్కరించింది. సాధారణంగా సెలబ్రిటీల ఇంటర్వ్యూలంటే సినిమాల గురించి, గ్లామర్‌ గురించి సాగుతాయి. కానీ పాయల్‌ రాజ్‌పుత్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూ ప్రశంసలతో మొదలై, కన్నీళ్లతో ముగిసింది. ఆమె మేధస్సును, నైపుణ్యాన్ని ఇంటర్వ్యూయర్‌ మెచ్చుకున్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయారు.

ఎందుకంటే గ్లామర్‌ ప్రపంచంలో నటీమణుల లోపలి ప్రతిభను గుర్తించేవారు చాలా తక్కువమంది ఉంటారు. తన మనసులోని భావాలను ఏమాత్రం ఫిల్టర్‌ లేకుండా చెప్పే పాయల్‌.. ఆ మాటలకు ఫిదా అయ్యారు. ''మీరు చేస్తున్న పాత్రల కంటే మెరుగైనవి రావాలని మీకు అనిపించడం లేదా?'' అన్న ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం ఆమెలోని పరిణితిని తెలియజేసింది. 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో ఒక వెలుగు వెలిగిన పాయల్‌.. ఆ తర్వాత అదే తరహా పాత్రలకు పరిమితం కావడంపై తన అసహనాన్ని బయటపెట్టారు.

''మనల్ని ఒకే రకమైన మూస పాత్రలకి పరిమితం చేస్తున్నప్పుడు మనం దానికి అలవాటు పడాలి. ఎందుకంటే నటులందరికీ అన్నింటిపై నియంత్రణ ఉండదు'' అని ఆమె నిష్కర్షగా చెప్పారు. చిత్ర పరిశ్రమలో ఒక నటి జీవితం ఎంత కఠినంగా ఉంటుందో వివరిస్తూ.. ''ఒక నటి ప్రతి రోజు అనిశ్చితితోనే నిద్ర లేస్తుంది. మాకు సరైన కాల్స్‌ వస్తాయా? రాబోయే మంచి అవకాశం కోసం ఇప్పుడున్న అవకాశాన్ని వదులుకోవాలా? ఒకవేళ వదులుకున్నాక అసలు అవకాశం రాకపోతే ఏం చేయాలి?'' వంటి సందేహాల మధ్య నిరంతర యుద్ధం జరుగుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తంచేశారు.

పాయల్‌ను చాలామంది ఒక 'అండర్‌ రేటెడ్‌' నటిగా చూస్తారు. తెలుగు సినిమాల్లో ఎందుకు కనిపించడం లేదు? అని అడిగే అభిమానులకు ఆమె వద్ద సూటి సమాధానం ఉంది. ''నాకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. బహుశా నన్ను చూసి ఇండస్ట్రీ జనాలు భయపడుతున్నారేమో'' అని ఆమె చమత్కరించారు. అయినప్పటికీ సరైన ప్రాజెక్ట్‌ కోసం వేచి చూస్తానని, కుదిరితే సరే.. లేదంటే తన దారి తాను వెతుక్కుంటానని ధీమాగా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!

త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి

Ranabaali: హార్స్ రైడింగ్ గ్లింప్స్.. విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!

Rao Bahadur: 'పెద్ది'తో పోటీకి మహేష్ బాబు 'నో'.. రిలీజ్ డేట్ మారింది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy