Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అందరి ముందు శ్రీలీలను అవమానించిన సీఎం భార్య..

అందరి ముందు శ్రీలీలను అవమానించిన సీఎం భార్య..

Chitrajyothy 1 day ago

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela)కు చేదు అనుభవం ఎదురైంది. ఈ వేడుకల్లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ (Amruta Fadnavis) కూడా పాల్గొన్నారు.

అయితే, కార్యక్రమం జరుగుతున్న సమయంలో స్టేజ్ మీద అమృత, ఆమె కూతురు, శ్రీలీల కలిసి ఫొటోలకు పోజులు ఇవ్వడానికి వచ్చారు. ఇక తల్లీకూతురి పక్కన శ్రీలీల ఎంతో మౌనంగా, ముఖంలో సంతోషం లేకుండానే నిలబడింది. ఇక ఫొటోగ్రాఫర్స్.. అమృతను.. కేవలం తల్లీకూతుళ్ల ఫోటోనే ఆడగడంతో.. వెంటనే ఆమె శ్రీలీలకు వేలు చూపించి పక్కకు వెళ్లి నిలబడమని చెప్పింది. దీంతో శ్రీలీల అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు నెటిజన్ల తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అమృత ప్రవర్తనపై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. కేవలం ఫొటోల కోసం ఒక సెలబ్రిటీ అని కూడా చూడకుండా, వేలు చూపిస్తూ పక్కకు తప్పుకోమనడం ఆమె అహంకారానికి నిదర్శనమంటూ నెటిజన్లు ఘాటుగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా శ్రీలీల అభిమానులు ఈ విషయంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అంత పెద్ద ఈవెంట్‌లో ఒక టాప్ హీరోయిన్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడంపై సౌత్ ఆడియన్స్ అమృతా ఫడ్నవీస్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.

ఈ వివాదంపై నెటిజన్లు స్పందిస్తూ.. రాజకీయంగా ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా, తోటి వ్యక్తులకు కనీస గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. ఫొటోల పిచ్చితో శ్రీలీలను అలా పక్కకు నెట్టేయడం అస్సలు బాలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ గందరగోళం జరుగుతున్న సమయంలో శ్రీలీల మాత్రం ఎంతో హుందాగా, ప్రశాంతంగా వ్యవహరించి అక్కడ నుండి పక్కకు జరగడం ఆమె సంస్కారానికి నిదర్శనమని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో టాలీవుడ్, బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy