Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ముస్తాబవుతున్న కశ్మీర్‌

అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ముస్తాబవుతున్న కశ్మీర్‌

Chitrajyothy 3 weeks ago

అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలను (International Film Festival of Jammu and Kashmir) ఘనంగా నిర్వహించడానికి కశ్మీర్‌ సిద్ధమవుతోంది. జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 7 నుంచి 10 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

'చలనచిత్రాల నిర్మాణం, సాంస్కృతిక అధ్యయనం, సృజనాత్మక సహకారానికి కశ్మీర్‌ కీలక వేదిక కావాలన్నదే ఈ ఉత్సవం ప్రధాన ఉద్దేశం. కశ్మీర్‌తో సినిమాకున్న అనుబంధాన్ని పునర్నిర్మించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. స్థానిక ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించడం, గ్లోబల్‌ సినిమా మ్యాప్‌లో కశ్మీర్‌కి తగినంత గుర్తింపు కలగజేయడం, పర్యాటక అభివృద్ధి వంటివి కీలక అంశాలు' అని నిర్వాహకులు తెలిపారు.

అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు గానూ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు సంతోష్‌ శివన్‌ సహా ఐదుగురితో జ్యూరీని ఏర్పాటు చేశారు. 41 దేశాలకు చెందిన 135 చలనచిత్రాలను ఉత్సవంలో ప్రదర్శించనున్నారు. వాటిలో 64 ఎంట్రీలు మన దేశానికి సంబంధించినవి. తొమ్మిది విభాగాల్లో చలనచిత్రాలను ఎంపిక చేసి మొత్తం రూ.96 లక్షల నగదును అందించనున్నారు.

ఉత్తమ చలనచిత్రానికి రూ.25 లక్షలను, ఉత్తమ దర్శకుడికి, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడికి తలా రూ.15 లక్షలను ఇవ్వనున్నారు. 'ఉత్తమ చిత్రం - జమ్మూకశ్మీర్‌ సెలక్ట్‌' కేటగిరీలో రూ.10 లక్షలను, ఉత్తమ నటీనటులకు తలా రూ.8 లక్షలను, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, సౌండ్‌ డిజైనర్‌, ఉత్తమ ఎడిటర్‌కి తలా రూ.5 లక్షలను ప్రకటించారు. దాల్‌ లేక్‌ మీద ఫ్లోటింగ్‌ స్ర్కీన్‌ ఏర్పాటు చేయాలనే ప్రణాళిక కూడా అమలులోకి రానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy