Dailyhunt
అనుమతి లేకుండా పాటల వినియోగం.. చిక్కుల్లో స్టార్ హీరో

అనుమతి లేకుండా పాటల వినియోగం.. చిక్కుల్లో స్టార్ హీరో

Chitrajyothy 0 months ago

న్నడ నటుడు, దర్శక నిర్మాత రక్షిత్‌ శెట్టి (Rakshit Shetty) నిర్వహిస్తున్న పరంవా స్టూడియోస్ కు ఢిల్లీ హైకోర్టు రూ.25 లక్షల జరిమానా విధించింది.

'బ్యాచిలర్‌ పార్టీ' అనే సినిమాలో తమ అనుమతి లేకుండా రెండు పాటలను వాడుకున్నారని ఎంఆర్‌టీ మ్యూజిక్‌ సంస్థ కోర్టును ఆశ్రయించింది. న్యాయ ఎల్లిదె, ఒమ్మె నిన్నన్ను అనే రెండు పాటలు తమ సంస్థకు చెందినవని, వాటిని బ్యాచిలర్‌ పార్టీ సినిమాలో వాడుకున్నారని ఫిర్యాదు చేసింది.

న్యాయ ఎల్లిదె అనే పాటను కేవలం ఏడు సెకెన్లు, ఒమ్మె నిన్నన్ను అనే పాటను 31 సెకన్ల పాటు మాత్రమే వినియోగించామని రక్షిత్‌ శెట్టి తరఫు న్యాయవాదులు వాదించారు. ఇంత తక్కువ సమయం వాడుకోవడం హక్కుల ఉల్లంఘన కిందకు రాదని తెలిపారు. వారి వాదనలను హైకోర్టు తిరస్కరించింది.

పాటల వినియోగం కాకతాళీయంగా జరుగలేదని, సినిమా కథకు అనుబంధంగా వాడుకున్నారని, వాణిజ్యపరంగా లాభం కోసం వాడుకున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. హీరో బాధలో ఉన్నప్పుడు న్యాయ ఎల్లిదె అనే పాటను వాడటం ఒక పథకం ప్రకారం జరిగిందని, ఇది హక్కుల పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.

రక్షిత్‌శెట్టికు జైలుశిక్ష నుంచి మినహాయింపు ఇచ్చిన ధర్మాసనం రూ.25లక్షల జరిమానాలో మార్పు లేదని స్పష్టం చేసింది. ఎంఆర్‌టీ మ్యూజిక్‌ సంస్థకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy