Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అయ్యగారి పేరు మారింది.. ఇక నుంచి అఖిల్ కాదు

అయ్యగారి పేరు మారింది.. ఇక నుంచి అఖిల్ కాదు

Chitrajyothy 3 weeks ago

క్కినేని అఖిల్ (Akhil) నటించిన తాజా చిత్రం లెనిన్ (Lenin). మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్రబృందం తాజాగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ని తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానుల కోలాహలం మధ్య ఈ ఈవెంట్ సాగింది. అయితే, ఈ వేడుకలో ఒక అక్కినేని అభిమాని చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక అక్కినేని అభిమాని.. అఖిల్ కి సరికొత్తగా నామకరణం చేశాడు. సాధారణంగా కెరీర్ బాగోకపోతే మంచిగా ఉండాలని చాలామంది స్టార్స్ పేరుకు ముందు, వెనుక లెటర్స్ యాడ్ చేసుకోవడం చూస్తూనే ఉంటాం. ఇక్కడ కొత్తగా అఖిల్ కి అభిమానినే పేరుకు ముందు నాగ యాడ్ చేశాడు. ఇకనుంచి అయ్యగారి పేరు అఖిల్ కాదు.. నాగ అఖిల్ అన్నమాట.

నాగ అఖిల్ .. పైకి వినడానికి ఇది సాధారణ పేరులా అనిపించినప్పటికీ.. ఆ అభిమాని ఈ పేరు వెనుక దాగున్న అసలు సీక్రెట్‌ను వివరిస్తుంటే ఈవెంట్‌లో ఉన్న వారందరూ షాక్ అయ్యారు. అక్కినేని వంశానికి చెందిన నలుగురు గొప్ప వ్యక్తుల పేర్ల కలయికే ఈ నాగ అఖిల్ అని ఆ అభిమాని చెప్పుకొచ్చాడు. ఆ పేరు వెనుక ఉన్న లెక్క ఏంటంటే.. అక్కినేని లెజెండ్, తాతగారైన నాగేశ్వరరావు లోని నాగ.. నానమ్మ అన్నపూర్ణమ్మలోని అ.. అలాగే తండ్రి నాగార్జునలోని నాగ.. తల్లి అమలలోని అ.. ఇలా ఈ నలుగురు మహానుభావులను నిరంతరం గుర్తుచేసేలా, వాళ్ల ఆశీస్సులు ఎప్పుడూ అఖిల్‌పై ఉండేలా నాగ అఖిల్ అని నామకరణం చేసినట్లు ఆ అభిమాని ప్రకటించాడు. ఈ అద్భుతమైన సెంటిమెంట్‌కు అక్కినేని ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

నిజంగానే అక్కినేని కుటుంబంలో అందరి పేర్లకు నాగ అని ఉంటుంది. నాగేశ్వరరావు, నాగార్జున, నాగ సుశీల, నాగ చైతన్య ఇలా ఎక్కువ నాగతో ముడిపడి ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ నాగ.. అఖిల్ పేరుకు కూడా యాడ్ అయ్యింది. అదృష్టం బావుండి.. లెనిన్ సక్సెస్ అయ్యి నాగ అఖిల్ పేరు కలిసి వస్తే.. ఇక అయ్యగారికి తిరుగే ఉండదు అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి అఖిల్.. తన అభిమాని పెట్టిన కొత్తపేరుతో కొనసాగుతాడా.. ? లైట్ తీసుకుంటాడా.. ? అనేది చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy