నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన జైలర్-2 (Jailer 2) చిత్రం ఈ యేడాది కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్ళు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది.
అనేక రికార్డులను కూడా బద్దలుకొ ట్టింది. ఈ నెల 15న విడుదలైన ఈ చిత్రం మొదటి ఐదు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టినట్టు బాక్సా పీస్ ట్రేడ్ వర్గాల సమాచారం.
అలాగే, విదేశాల్లో కూడా రికార్డు స్థాయిలో వసూళ్లున్నాయి. ఓవర్సీస్ వసూళ్ళలో తమిళ విభాగంలో 2023లో వచ్చిన విజయ్ 'లియో' రూ.203 కోట్లతో ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉండగా, 'జైలర్-2' మూవీ ఈ రికా ర్డును బ్రేక్ చేసింది. 2023లో వచ్చిన జైలర్' తొలి భాగం రూ.190 కోట్లకుపైగా వసూళ్ళను సాధించింది.
దక్షిణభారత చలన చిత్రాల్లో విదేశీ వసూళ్ళలో టాప్-5 గా ఇప్పటివరకు 'బాహుబలి-2', 'ఆర్ఆర్ఆర్, 'కల్కి 2898 ఏడీ', 'పుష్ప-2', 'లియో' మూవీలు ఉండగా, ఇపుడు 'జైలర్-2' చిత్రం లియో'ను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. అలాగే, ఈ యేడాది కోలీవుడ్‌లో విడుదలైన అన్ని చిత్రాల్లోకెల్లా 'జైలర్-2' మూవీ అత్యధిక వసూళ్ళను సాధించి అగ్రస్థానంలో ఉంది.

