Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాక్సాఫీస్‌పై 'పెద్ది' వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?

బాక్సాఫీస్‌పై 'పెద్ది' వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?

Chitrajyothy 2 weeks ago

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో రూపొంది, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం 'పెద్ది' (Peddi).

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రీమియర్స్‌తో పాటు, థియేటర్లలో విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోన్న ఈ చిత్రం.. కేవలం 7 రోజుల్లోనే (Peddi First Week Collections) ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ అధికారికంగా ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ ఊరమాస్ లుక్, గుబురు గడ్డం, ముక్కుకు పోగు.. ఇలా సరికొత్త అవతారంలో కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ముఖ్యంగా సెంటిమెంట్, ఎమోషన్, అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్‌తో బుచ్చిబాబు తెరకెక్కించిన విధానం క్లాస్, మాస్ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమాను చూసేందుకు ఫ్యామిలీస్ క్యూ కడుతున్నాయి. రెండో వీకెండ్‌లో వచ్చే కలెక్షన్స్‌తో ఈ సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుందని అటు ఫ్యాన్స్, ఇటు మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్, జగపతి బాబుల యాక్టింగ్‌తో పాటు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. వారం రోజులు గడిచినా థియేటర్ల వద్ద కలెక్షన్ల జోరు తగ్గకపోవడం చూస్తుంటే ఈ చిత్రం మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ స్టార్ దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో మెరిశారు. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల మధ్య విడుదలైన 'పెద్ది'.. బాక్సాఫీస్ ఛాంపియన్‌గా నిలిచి మెగాభిమానులకు అసలైన పూనకాలు తెప్పిస్తోంది.

ఇవి కూడా చదవండి:

నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్‌కు ఫిదా!

Ravi Mohan: భార్యకు నెలకు రూ.40 లక్షల భరణం.. హీరో రవి మోహన్‌కు కోర్టులో చుక్కెదురు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy