Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలయ్య మూవీ సెట్ ఫోటో వైరల్.. త్వరలోనే క్రేజీ అప్‌డేట్!

బాలయ్య మూవీ సెట్ ఫోటో వైరల్.. త్వరలోనే క్రేజీ అప్‌డేట్!

Chitrajyothy 1 week ago

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి మనందరికీ ఎరుకే.

ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. బాలయ్య, సముద్రఖని వంటి కీలక నటుల మధ్య ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ ఒక ప్రత్యేకమైన ఐటెం సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉంది. సినిమా సెట్స్ నుంచి సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్ షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూస్తుంటే ఈ సినిమాలో విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. ముఖ్యంగా బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా థమన్ ఈసారి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వృద్ధి సినిమాస్ వారు ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఒక అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారట. గోపీచంద్ మలినేని మార్క్ మాస్ ఎలివేషన్లు, అలాగే ఎస్.ఎస్. థమన్ ఇచ్చే పవర్‌ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. 'భగవంత్ కేసరి' వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. దీనితో పాటు మలయాళ బ్యూటీ హనీరోజ్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నటీనటుల ఎంపిక విషయంలోనే సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. బాలయ్య, థమన్ కాంబినేషన్‌లో ఇప్పటివరకు వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్, భగవంత్ కేసరి, అఖండ-2 వంటి సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు ఈ చిత్రానికి కూడా థమన్ పనిచేస్తుండటంతో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటల విషయంలో మరోసారి మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంతా భావిస్తున్నారు.

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో గతంలో వచ్చిన 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండటంతో నందమూరి అభిమానులు ఈ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఒక హిట్ కాంబినేషన్ తిరిగి రావడం ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలంటే మూవీ విడుదల వరకు ఎదురుచూడక తప్పదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy